Nokia: పాత ఫోన్‌లే సరికొత్తగా.. కొత్త ట్రెండ్‌కి తెర తీసిన నోకియా

ఒకప్పుడు ఫీచర్స్‌ ఫోన్‌లతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్న నోకియా. ఇప్పుడు తాజాగా మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా నోకియా 130, నోకియా 150 పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. స్మార్ట్ ఫోన్‌లు వద్దనుకునే వారికి, స్క్రీన్‌ టైమ్‌ పెరుగుతుందని ఆందోళన చెందే వారిని టార్గెట్ చేస్తూ నోకియా ఈ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇంతకీ నోకియా నుంచి వస్తున్న ఆ రెండు స్మార్ట్ ఫోన్‌ల ధర ఎంత.?

Nokia: పాత ఫోన్‌లే సరికొత్తగా.. కొత్త ట్రెండ్‌కి తెర తీసిన నోకియా
Nokia Feature Phones

Updated on: Aug 05, 2023 | 9:45 AM

ఒకప్పుడు ఫోన్‌ అంటే కేవలం నోకియా మాత్రమే. మనలో చాలా మంది మొదటిసారి ఉపయోగించిన ఫోన్‌ నోకియానే అయ్యుంటుంది. ఫీచర్‌ ఫోన్స్‌కు పెట్టింది పేరైనా నోకియా బ్రాండ్‌ ఆ తర్వాత ఆ పేరును క్రమంగా కోల్పోయింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లో నోకియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను కాదని విండోస్‌ ఓఎస్‌తో మార్కెట్లోకి ఫోన్‌లను విడుదల చేసినా అవి సక్సెస్‌ కాలేకపోయాయి. దీంతో నోకియా కూడా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ఫోన్‌లను విడుదల చేయాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే ఒకప్పుడు ఫీచర్స్‌ ఫోన్‌లతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకున్న నోకియా. ఇప్పుడు తాజాగా మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా నోకియా 130, నోకియా 150 పేర్లతో రెండు ఫోన్‌లను తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. స్మార్ట్ ఫోన్‌లు వద్దనుకునే వారికి, స్క్రీన్‌ టైమ్‌ పెరుగుతుందని ఆందోళన చెందే వారిని టార్గెట్ చేస్తూ నోకియా ఈ కొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఇంతకీ నోకియా నుంచి వస్తున్న ఆ రెండు స్మార్ట్ ఫోన్‌ల ధర ఎంత.? వాటిలో ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

నోకియా 130..

నోకియా 130 ఫీచర్‌ ఫోన్‌లో 2.4 ఇంచెస్‌ QVGA డిస్‌ప్లేను అందించారు. ఇందులో 1450 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన రిమూవబుల్‌ బ్యాటరీని ఇచ్చారు. అయితే ఈ ఫోన్‌లో కెమెరా ఆప్షన్‌ను ఇవ్వలేదు. కీప్యాడ్‌తో వచ్చే ఈ ఫీచర్‌ ఫోన్‌లో స్నేక్‌ గేమ్‌ను సరికొత్త వెర్షన్‌తో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను ఒక్కసారిగా ఛార్జ్‌ చేస్తే ఏకంగా నెల రోజుల వరకు స్టాండ్‌ బై వస్తుంది.

నోకియా 150..

ఇక నోకియా 150 ఫీచర్‌ ఫోన్‌ విషయానికొస్తే ఇందులో 2.4 ఇంచెస్‌ QVGA డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో కెమెరాను ఇచ్చారు. 0.3 మెగా పిక్సెల్ ఈ కెమెరా కెపాసిటీ. ఇక ఇందులో మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌ను కూడా అందించారు. దీంతో పాటలు ప్లే చేసుకోవచ్చు. ఇక ఇందులోని 1450 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో ఏకంగా నెల రోజుల పాటు స్టాండ్‌బై టైం ఇస్తుంది.

ఇదిలా ఉంటే ఈ రెండు ఫోన్ లకు సంబంధించి నోకియా ఆగస్టు 2వ తేదీన అధికారిక ప్రటకన చేసింది. త్వరలోనే ఈ ఫోన్ లు మార్కెట్లో సందడి చేయనున్నారు. అయితే ఈ ఫోన్ ల ధర ఎంత అన్న దానిపై ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే నెట్టింట్ వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ స్మార్ట్ ఫోన్ ల ధరల రూ. 2 నుంచి రూ. 3 వేలలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..