వాచ్‌లలో ఫాస్ట్రాక్ బ్రాండ్‌కి మంచి డిమాండ్ ఉంది. మణికట్టుకు దానిని ధరించడం ఓ స్టేటస్ సింబల్ గా కూడా తీసుకొనే వారు ఉన్నారు. అయితే ఇటీవల స్మార్ట్ వాచ్ ల అరంగేట్రంతో సాధారణ అనలాగ్ వాచ్‌ల ప్రభ కాస్త తగ్గింది. దీంతో ఫాస్ట్రాక్ కూడా స్మార్ట్ వాచ్‌ల తయారీపై దృష్టి కేంద్రీకరించింది. వరుసగా స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తోంది. ఈక్రమంలో ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో వాచ్ ను ఇండియాలో లాంచ్ చేసింది. దీనిలో అత్యాధునిక ఫీచర్లను అందించింది. దీని డిస్ ప్లే ఈ స్మార్ట్ వాచ్ ప్రధాన ఆకర్షణ కానుంది. ఈ డిస్ ప్లే కాస్త వంపు తిరిగి ఆర్క్ రూపంలో ఉంటుంది. దాదాపు 110 కిపైగా స్పోర్ట్స్ మోడ్లకు ఈ వాచ్ సపోర్టు చేస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రారంభ ఆఫర్ కింద దీనిని రూ. 5,000లోపు ధరతో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇది అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
లుక్ అండ్ డిజైన్.. ఈ స్మార్ట్ వాచ్ గత నెలలో విడుదల చేసిన లిమిట్ లెస్ ఎఫ్ఎస్1 మోడల్ లాగానే ఉంటుంది. ఇది మన దేశంలో రీవోల్ట్ సిరీస్ లో లాంచ్ అయిన మొదటి వాచ్. ఈ వాచ్ లుక్ డిఫరెంట్ గా ఇచ్చారు. అర్క్ డ్ డిజైన్ ఇచ్చారు. అంటే స్క్రీన్ వంపు తిరిగి కనిపిస్తుంది. ఇది మీ చేతికి అందాన్ని హందాతనాన్ని పెంచడంతో పాటు చేతికి కమ్ ఫర్ట్ నెస్ ని అందిస్తుంది.
స్పెసిఫికేషన్లు.. ఈ ఫాస్ట్రాక్ వాచ్ 1.96 ఇంచుల సూపర్ అమోలెడ్ ఆర్క్‌డ్ డిస్‍ప్లేను కలిగి ఉంది. ఆల్వేస్ ఆన్ డిస్‍ప్లే ఫీచర్ ఉంటుంది. 200కు పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍తో ఈ వాచ్ వచ్చింది.
సామర్థ్యం.. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. 10 నిమిషాల చార్జ్‌తో ఒక రోజు వినియోగించుకునేలా నోట్రోఫాస్ట్ చార్జింగ్‍కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.
ఫీచర్లు.. సింగిల్ సింక్ బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది. ఇందుకోసం ఈ వాచ్‍లో మైక్, స్పీకర్ ఉన్నాయి. మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, ఒత్తిడిని విశ్లేషించే స్ట్రెస్ మానిటరింగ్ హెల్త్ ఫీచర్లతో ఈ ఫాస్ట్రాక్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. 110కి పైగా స్పోర్ట్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఫోన్‍లో ఫాస్ట్రాక్ రిఫ్లెక్స్ వరల్డ్ యాప్‍నకు ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు. అలాగే మొబైల్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు వాచ్‍లోనే నోటిఫికేషన్లు పొందవచ్చు. ఏఐ వాయిస్ అసిస్టెంట్‍కు సపోర్ట్ చేస్తుంది.
ధర, లభ్యత.. ఫాస్ట్రాక్ రివోల్ట్ ఎఫ్ఎస్1 ప్రో స్మార్ట్‌వాచ్ ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, ఫాస్ట్రాక్ అధికారిక వెబ్‍సైట్‍లో సేల్‍కు వస్తుంది. బ్లాక్, బ్లూ, టీల్ కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తుంది. కంపెనీ దీనిని ప్రారంభ ఆఫర్ కింద రూ.3,995కే అందిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..