ప్రస్తుతం యువతంతా స్మార్ట్ ఫోన్లనే వాడుతున్నారు. భారత్ లో స్మార్ట్ ఫోన్ల మార్కెట్ విపరీతంగా పెరిగింది. వివిధ కంపెనీలు తమ కొత్త మోడల్స్ తో వినియోగదారులను ఆకట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్ సంగ్..తన కొత్త ఫోన్ సామ్ సంగ్ గాలక్సీ ఎఫ్ 04 ను ఈ నెల ప్రారంభంలో మార్కెట్ లోకి లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్, సామ్ సంగ్ వెబ్ సైట్ లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. కేవలం మధ్య తరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ వారి బడ్జెట్ కు అనుగుణంగా ఉండే ఈ స్మార్ట్ ఫోన్ ను రూపొందించింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఈ ఫోన్ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈ ఫోన్ కేవలం 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లోనే వినియోగదారులకు అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 9499. కానీ ప్రారంభ ఆఫర్ లో దీన్ని రూ.8499 కే అందుబాటులో ఉంచింది. అలాగే అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్ స్టెంట్ తగ్గింపుతో వస్తుంది. అంటే రూ.7499 కే ఇది వినియోగదారుల చేతికి వస్తుంది. ఈ ఫోన్ లో రెండు కలర్ వేరియంట్లు ఉన్నాయి. ఓపల్ గ్రీన్, జాడ్ పర్పుల్ వేరియంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం