Cyber Jobs:సైబర్ నేరగాళ్లను పట్టించే ఉద్యోగం, మంచి జీతం..ఇవే అర్హతలు

మన సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక క్లిక్‌తో మన ఖాతాలోని డబ్బునంత స్వాహా చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అలాంటి సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు సైబర్ దోస్త్ పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే సైబర్ దోస్త్ కొన్ని ఉద్యోగాలను ప్రకటించింది. ఇందులో సైబర్ క్రిమినల్స్‌ను

Cyber Jobs:సైబర్ నేరగాళ్లను పట్టించే ఉద్యోగం, మంచి జీతం..ఇవే అర్హతలు
New Jobs Are Available In Cyber ​​dost, Which Is Organized By The Central Government To Catch Cyber Criminals

Edited By: Srikar T

Updated on: Nov 09, 2023 | 5:16 PM

మన సమాజంలో రోజురోజుకీ పెరిగిపోతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నిస్తుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కూర్చొని ఒక క్లిక్‌తో మన ఖాతాలోని డబ్బునంత స్వాహా చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అలాంటి సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు సైబర్ దోస్త్ పేరుతో ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నడిచే సైబర్ దోస్త్ కొన్ని ఉద్యోగాలను ప్రకటించింది. ఇందులో సైబర్ క్రిమినల్స్‌ను పట్టించే పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ( ICCC) లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది.

సైబర్ నెరగాలను పట్టుకోవడమే ధ్యేయంగా సైబర్ దోస్త్ పనిచేస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న నేరస్తుల డేటా అంతా ఓకే డేటాబేస్ లో ఉంచారు. అయితే సైబర్ క్రిమినల్స్ ను అరికట్ట లేకపోతున్నారు వారి ఆగడాలను చేదించలేకపోతున్నారు. కొత్త కొత్త తరహాలో క్రిమినల్స్ ఎత్తుగడలు వేస్తున్నారు.. వీటికి అడ్డుకట్టు వేసేందుకు కేంద్ర హోమ్ శాఖ సిద్ధమైంది. టెక్నికల్గా మంచి అవగాహన ఉన్న వారిని రిక్రూట్ చేసుకునేందుకు నిర్ణయించింది. ఈ మేరకు టెలి కమ్యూనికేషన్స్ కన్సల్టెన్సీ ఇండియా లిమిటెడ్ (TCIL ) పలు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇవి కూడా చదవండి
  • ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – 2 పోస్ట్ లు
  • అర్హత :- B.E/BTech/M.tech/MCA/B.sc (eng)
  • ఎడ్యూకేషన్ బోర్డ్:- గుర్తింపు పొందిన ప్రముఖ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ లేదా డిగ్రీ
  • వయసు :- జనవరి 1 2024 కల్లా 56 సంవత్సరాలకు మంచి ఉండకూడదు
  • జీతం :- (1 లక్ష 50 వేల నుండి 3 లక్షల రూపాయలు)+స్పెషల్ అలవెన్సులు

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..