ప్రస్తుతం అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు. కానీ వాటి మైలేజ్ విషయంలో కాస్త ఆసక్తి తగ్గి వాటి కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువ పట్టణ వాసులే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే వారికి మైలేజ్ విషయంలో అనుమానం ఉన్నా వెంటనే ఇంటికి చేరుకోవచ్చనే ఉద్దేశంతో వాటిని కొనుగోలు చేస్తున్నారు. కానీ ఎలక్ట్రిక్ బైక్స్ తో లాంగ్ రైడ్స్ కు వెళ్లాలనుకుంటే మాత్రం ఆ ఆలోచననే మనస్సు నుంచి తీసేస్తారు. కానీ ప్రస్తుతం కొన్ని సూపర్ బైక్స్ అధిక మైలేజ్ ను ఆఫర్ చేస్తున్నా ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ లో మాత్రం ఎక్కువగా 120 కి.మి మించి మైలేజ్ ఆఫర్ చేయడం లేదు. కానీ ప్రస్తుతం మరో ఎలక్ట్రిక్ స్కూటర్ అధిక మైలేజ్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఓ సారి చార్జ్ చేస్తే ఏకంగా 225 కి.మి మైలేజ్ ఇస్తుంది. అంటే కేవలం 15 పైసల ఖర్చుతో ఓ కిలోమీటర్ ప్రయాణించవచ్చు. ఎన్ డీఎస్ ఎకో మోటర్స్ తన కొత్త మోడల్ స్కూటర్ లియో ప్లస్ ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ బైక్ రఫ్ అండ్ టఫ్ లుక్ తో వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు. ఈ బైక్ లో ఉండే ఎక్స్ ట్రా ఫీచర్స్ ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఎన్ డీఎస్ లియో ప్లస్ రూ.1,23,978 ఎక్స్ షోరూమ్ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ న్యూడిల్లీ లో అయితే ఆన్ రోడ్ ప్రైస్ రూ1,28,657 అవుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. లియో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 72వీ, 21 ఏహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పాటు 1600 డబ్ల్యూబీఎల్ డీసీ మోటార్‌తో శక్తిని పొందుతుంది. కంపెనీ ఇచ్చిన వివరాల ప్రకారం, ఈ బ్యాటరీ ప్యాక్ సాధారణ ఛార్జర్‌తో ఛార్జ్ చేసినప్పుడు 2 నుంచి 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.
ఈ లియోప్లస్ బైక్ ను ఓ సారి చార్జ్ చేస్తే 225 కిలో మీటర్ల రైడింగ్ రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే గంటకు 55 కిలోమీటర్ల స్పీడ్ రేంజ్ వస్తుందని పేర్కొంటున్నారు. ఇది ఎకానమీ మోడ్ లో 225 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే సాధారణ మోడ్ లో 190 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. మూడో మోడ్ పవర్ మోడ్ లో 175 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. ముందు చక్రంలో డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ వస్తుంది. అలాగే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, డిజిటల్ ట్రిప్ మీటర్, డిజిటల్ స్పీడో మీటర్, పుష్ బటన్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, హాలోజన్ హెడ్ లైట్, ఎల్ ఈడీ టెయిల్ లైట్, ఎల్ ఈడీ టర్న్ సిగ్నల్ ల్యాంప్, లో బ్యాటరీ ఇండికేటర్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..