స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఉపయోగించే స్మార్ట్ యాక్ససరీస్ వినియోగాన్ని యువత ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గతంలో ఫోన్ నుంచి మంచి మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ వాడేవారు. అయితే అవి వైర్డ్ ఇయర్ ఫోన్స్ కావడంతో కచ్చితంగా ఫోన్‌ను మన దగ్గరే ఉంచుకోవాల్సి వచ్చేది. దీంతో బ్లూటూత్ ద్వారా పని చేసేలా ఇయర్‌బడ్స్ రావడంతో యువత వాటి కొనుగోలలుపై ఆసక్తి చూపుతున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు కూడా వివిధ రకాల ఇయర్‌బడ్స్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా నాయిస్ కంపెనీ నయా ఇయర్ బడ్స్ వీఎస్ 106 లాంచ్ చేసి తన నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లైనప్‌ను విస్తరించింది.
ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు 50 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందించగలవని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఇయర్‌బడ్స్ మూడు విభిన్న ఈక్యూ మోడ్‌లతో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ రియల్‌టైమ్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. నాయిస్ వీఎస్ 106 ఇయర్ బడ్స్ ధర రూ.1299గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఇయర్‌బడ్స్ అమెజాన్‌తో పాటు నాయిస్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను జెట్ బ్లాక్, స్కై బ్లూ, క్లౌడ్ వైట్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఇయర్ బడ్స్ ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
నాయిస్ బడ్స్ వీఎస్ 106 10 ఎంఎం డ్రైవర్ యూనిట్‌తో వస్తాయి. ఇది 40 ఎంస్ వరకు అల్ట్రా-తక్కువ లేటెన్సీ మోడ్‌ను కలిగి ఉంటుంది. నిజమైన వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు హైపర్‌సింక్ టెక్నాలజీతో వస్తాయి. దీంతో ఈ ఇయర్‌బడ్స్ వెంటే పేయిర్ అవుతాయి. నాయిస్ బడ్స్ వీఎస్ 106 బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. ఇయర్‌బడ్‌లు మూడు విభిన్న ఈక్యూ మోడ్‌లతో వస్తాయి. దీంతో ఇవి లీనమయ్యే సౌండ్ అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంది. ఈ తాజా ఇయర్‌బడ్స్ ఈఎన్‌సీ మద్దతు ఇచ్చే క్వాడ్ మైక్‌తో వస్తుంది.
ముఖ్యంగా కాల్స్ సమయంలో బ్యాక్‌గ్రౌండ్ శబ్దం మొత్తాన్ని తొలగిస్తాయని కంపెనీ పేర్కొంది. నాయిస్ బడ్స్ వీఎస్ 106 ఐపీఎక్స్5 రేటింగ్‌తో వస్తుంది. దీంతో ఈ ఇయర్‌బడ్‌లను నీటి-నిరోధకతతో ఆకర్షణీయంగా ఉంటాయి. నాయిస్ బడ్స్ వీఎస్ 106 మొత్తం 50 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు శీఘ్ర ఛార్జ్ మద్దతుతో కూడా వస్తాయి. 10 నిమిషాల ఛార్జ్‌తో వినియోగదారులు 200 నిమిషాల ప్లేబ్యాక్ సమయాన్ని ఆస్వాదించవచ్చని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..