Whatsapp: వాట్సాప్‌లో సరికొత్త ఆస్క్ మెటా AI ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందో తెలుసా?

వాట్సాప్ తన వినియోగదారులకు మరింత సౌకర్య వంతమైన సేవలను అందించే లక్ష్యంతో కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఇటీవలే స్టేటస్‌ విభాగంలో మల్ఫిపుల్‌ ఫోటోస్‌ కొలేజ్‌ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌ ఈసారి ASK Meta AI ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ మెటా ఏఐ ఫీచర్‌ ఏంటి.. దీన్ని ఎలా యూజ్‌ చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

Whatsapp: వాట్సాప్‌లో సరికొత్త ఆస్క్ మెటా AI ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందో తెలుసా?
Whatsapp Meta Ai

Updated on: Aug 23, 2025 | 5:27 PM

వాట్సాప్ తన వినియోగదారులకు మరింత సౌకర్య వంతమైన సేవలను అందించే లక్ష్యంతో కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగా ఇటీవలే స్టేటస్‌ విభాగంలో మల్ఫిపుల్‌ ఫోటోస్‌ కొలేజ్‌ చేసుకునే ఫీచర్‌ను తీసుకొచ్చిన వాట్సాప్‌ ఈసారి ASK Meta AI ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో మీరు ఏదైనా సందేశం గురించి తక్షణ సమాచారాన్ని పొందవచ్చు. WABetaInfo నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ ప్రస్తుతం Android 2.25.23.24 కోసం WhatsApp బీటాలో టెస్ట్‌ చేయబడుతుంది. ఇది త్వరలో అందరూ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

మీకు ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడల్లా, దాని ఆప్షన్‌లో Ask Meta AI కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయడం ద్వారా, మీరు ఆ మెసేజ్‌ను నేరుగా Meta AI చాట్‌కు పంపవచ్చు. అక్కడ మీరు ఆ మెసేజ్‌కు సంబంధించిన ప్రశ్నను అడగవచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా మీరు ఫేక్‌ మెసెజెస్‌ గురించి తెలుసుకొవచ్చు.

Ask Meta AI ఎలా పని చేస్తుంది?

అయితే ఇప్పుడు మీకు ఒక ఫార్వార్డ్ మెసేజ్ లేదా న్యూస్‌ వచ్చిందని అనుకుందాం, ఆ మెసేజ్ సరైనదా కాదా అని మీరు తెలుసుకోవాలనుకుంటే. మీరు ఆ మెసేజ్‌ ఫార్వర్డ్‌ చేసే ముందు .. దాని పక్కడే కనిపించే Ask Meta AI పై క్లిక్ చేయాలి. దీంతో ఆ మెసేజ్ Meta AI చాట్‌లో హైలైట్ అవుతుంది, మెటా ఏఐ దాని గురించిన పూర్తి సమాచారాన్ని మీకు అందిస్తుంది. దానిపై మీకు ఏవైన ప్రశ్నలు ఉన్న కూడా మీరు అడగవచ్చు. దీని వల్ల మీకు వచ్చిన మెసెజ్, న్యూస్ నిజమా, కాదా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు.

ఈ ఫీచర్‌ ఎందుకు ప్రత్యేకమైనది?

వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఈ ఫీచర్ నకిలీ వార్తలు, పుకార్లను నిరోధించడంలో సహాయపడుతుంది. ఏదైనా వైరల్ మెసేజ్ నిజమా, కాదా అనే వాస్తవాలను మీరు సులభంగా తెలుసుకునేందుకు వీలవుతుంది. ఇది తప్పుడు సమాచారం వ్యాప్తి చెందే అవకాశాలను తగ్గిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా వెర్షన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. కంపెనీ త్వరలో దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్‌ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

మరిన్ని సైన్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.