Motorola Moto G47 Power స్మార్ట్​ఫోన్‌ ఫీచర్లు, బ్యాటరీ వేరే లెవెల్.. ధర ఎంతంటే​

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మోటరోలా మరో కొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. Motorola Moto G47 Power పేరుతో యూరప్ మార్కెట్లలో విడుదలైన ఈ మొబైల్‌లో 108MP ప్రధాన కెమెరా, 7,000mAh భారీ బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ వినియోగంతో పాటు ఎక్కువసేపు వీడియోలు చూసేవారు, సోషల్ మీడియా ఉపయోగించేవారు, ఫోన్‌లో ఫొటోలు తీసేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో వచ్చిన ఈ మోడల్ ప్రస్తుతం యూకే మార్కెట్‌లో 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉన్నట్లు సమాచారం.

Motorola Moto G47 Power స్మార్ట్​ఫోన్‌ ఫీచర్లు, బ్యాటరీ వేరే లెవెల్.. ధర ఎంతంటే​
Motorola Moto G47 Power

Updated on: Oct 29, 2026 | 8:50 PM

Moto G47 Powerలో పెద్ద బ్యాటరీతో పాటు కెమెరా, డిస్‌ప్లే విభాగాల్లోనూ ప్రత్యేక ఫీచర్లను అందించారు. HD+ రిజల్యూషన్ ఉన్న LCD స్క్రీన్, 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్, స్టీరియో స్పీకర్లు, Dolby Atmos సపోర్ట్ ఇందులో ఉన్నాయి. నీటి చినుకులు పడినప్పుడు టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించేందుకు Water Touch టెక్నాలజీని కూడా ఇచ్చారు. అయితే, ఈ ఫోన్ భారత మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు.

Motorola Moto G47 Power స్పెసిఫికేషన్లు..

ఈ ఫోన్‌లో 6.67 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 1604 × 720 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,050 నిట్స్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass 7i ఉంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో పాటు 4GB RAM, 128GB స్టోరేజ్ అందించారు. మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే, వెనుకవైపు f/1.7 అపెర్చర్‌తో 108MP ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. ప్రధాన కెమెరాలో 3x లాస్‌లెస్ జూమ్ సదుపాయం ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అందించారు.

ఇతర ఫీచర్లు

Moto G47 Powerలో 7,000mAh బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. దీనికి 30W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇతర ఫీచర్లలో స్టీరియో స్పీకర్లు, Dolby Atmos, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, NFC కనెక్టివిటీ, IP64 రేటింగ్, MIL-STD-810H డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ ఉన్నాయి.

ధర విషయానికి వస్తే, యూకేలో 4GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర £299.99గా ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.37,900. Pantone Nautical Blue, Pantone Capri, Pantone Impenetrable రంగుల్లో ఈ ఫోన్ లభిస్తున్నట్లు సమాచారం. భారత మార్కెట్లో విడుదల, ధర వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us