Motorola Edge 20: ఆగస్టు 5న మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్ ఫోన్లు.. లీకైన ఫీచర్లు.. చూస్తే వావ్ అనాల్సిందే…!

|

Jul 30, 2021 | 10:55 AM

మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది. మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్‌లో నాల్గవ మోడల్‌గా ఇది విడుదల కానుంది. కొత్త మోడల్ గత కొన్ని వారాలుగా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

Motorola Edge 20: ఆగస్టు 5న మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్ ఫోన్లు.. లీకైన ఫీచర్లు.. చూస్తే వావ్ అనాల్సిందే...!
Motorola Edge 20
Follow us on

Motorola Edge 20: మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ వచ్చే వారం విడుదలకు సిద్ధంగా ఉంది. మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్‌లో నాల్గవ మోడల్‌గా ఇది విడుదల కానుంది. కొత్త మోడల్ గత కొన్ని వారాలుగా నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. మోటరోలా ఎడ్జ్ 20 లైట్, మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ప్రోలతో విడుదల కానుందని వార్తలు వెలువడుతున్నాయి. మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్‌లోని మూడు మోడళ్లు ఇటీవల ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. కాగా, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ గురించిన వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్‌లో వస్తున్న మోడళ్ల పేర్లను కనుగొన్నట్లు టెక్నాలజీ వెబ్‌సైట్ డీల్‌టెక్ పేర్కొంది. ఫోన్‌తోపాటు కలర్లను కూడా ఈ వెబ్‌సైట్ లీక్ చేసింది. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్, మోటరోలా ఎడ్జ్ 20 లైట్ రెండూ ఒకే మోడల్స్‌గా రానున్నాయంట.

అయితే ఇందులో మోటరోలా ఎడ్జ్ 20 వేరియంట్ యూఎస్‌లో విడుదల కానుందని వార్తలు వెలువడున్నాయి. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ యూఎస్ మార్కెట్‌కి పరిమితమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ ఫీచర్లతో పాటు ఇతర వివరాలు అధికారికంగా విడుదల కాలేదు. ఇప్పటికైతే ఆన్‌లైన్‌లో కొన్ని ఫీచర్లు షికార్లు చేస్తున్నాయి. మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగెన్ 870 ప్రాసెసర్‌తో రానుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో రానుంది. కాగా, మోటరోలా ఎడ్జ్ 20 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778 జీతో రానుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుందని తెలుస్తోంది. మరోవైపు, మోటరోలా ఎడ్జ్ 20 లైట్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 720 ఎస్‌ఓసీ ఉండనున్నట్లు సమాచారం. ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 20, మోటరోలా ఎడ్జ్ 20 ప్రో రెండూ 6.7-అంగుళాల పూర్తి-హెచ్‌డీ + డిస్ప్లేలతోపాటు 144హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో విడుదల కానున్నట్లు సమాచారం. మోటరోలా ఎడ్జ్ 20 లైట్ మాత్రం 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు 6.7-అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. మోటరోలా ఎడ్జ్ 20 ప్రోలో పెరిస్కోప్ లెన్స్ ఉందని వార్తలు వెలువడుతోంది. ఎడ్జ్ 20, ఎడ్జ్ 20 లైట్‌లో ఇది అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తోంది. విడుదల తేదీ విషయానికి వస్తే.. మోటరోలా ఆగస్టు 5 న ఓ కార్యక్రమాన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్‌లోనే ఎడ్జ్ 20 సిరీస్‌ను ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈలోపు ఇంకెన్ని పుకార్లు విడుదలవుతాయో చూడాలి.

Also Read: Portronics Kronos Beta: ఈ స్మార్ట్ వాచ్ లో 300 పాటలు స్టోర్ చేసుకోవచ్చు.. సరికొత్త ఫీచర్లతో వస్తున్నదీని ధర ఎంతో తెలుసా?

Windows 11: మీ పీసీలో విండోస్ 11 పొందాలా.. అయితే ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!