Smart Phone: మడత పెట్టే ఫోన్‌పై మతిపోయే ఆఫర్లు..నయా ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్ చేసిన మోటో

ఇటీవల కాలంలో యువత ఎక్కువగా స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. అయితే నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు అధునాతన ఫీచర్లతో వచ్చే స్మార్ట్‌ఫోన్లను ఇష్టపడుతున్నారు. అలాగే ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ మోటరోలా తన రేజర్ 60 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు కంపెనీ అతి తక్కువ ధరకు అందించే ఫోన్ ఇదే. కాబట్టి మోటరోలా రేజర్ 60 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Smart Phone: మడత పెట్టే ఫోన్‌పై మతిపోయే ఆఫర్లు..నయా ఫోల్డబుల్ ఫోన్ రిలీజ్ చేసిన మోటో
Moto Razr 60

Updated on: Jun 05, 2025 | 6:00 PM

మోటరోలా రేజర్ 60 ఫోన్‌లో పీఓఎల్ఈడీ డిస్‌ప్లే, మన్నికైన టైటానియం హింజ్ యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. గత సంవత్సరం మోటరోలా రిలీజ్ చేసిన రేజర్ 50కి అప్‌గ్రేడ్‌గా ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. స్మార్ట్ ఫోన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మోటరోలా అధికారిక సైట్, ఇతర రిటైలర్లలో కొనుగోలుకు అందుబాటులో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రకటించారు. మోటరోలా రేజర్ 60 భారతదేశంలో రూ. 49,999 ధరతో ప్రారంభించారు. ఈ స్మార్ట్ ఫోన్ పెనాటోన్ జిబ్రాల్టర్ సీ, పెనాటోన్ స్ప్రింగ్ బడ్, పెనాటోన్ లైటెస్ట్ స్కై రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిలయన్స్ డిజిటల్‌తో సహా అనేక ఇతర రిటైలర్ల నుండి కూడా ఇది అందుబాటులో ఉంది. ముఖ్యంగా కొనుగోలుదారులు ఆకర్షణీయమైన బ్యాంక్ డిస్కౌంట్లుతో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను ఆయా సైట్లు అందిస్తున్నాయి. బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేసినప్పుడు 5 శాతం క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంది. అలాగే నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా ఆశ్వాదించవచ్చు. అదనంగా వినియోగదారులు తమ పాత ఫోన్‌ల కోసం ఎక్స్ఛేంజ్‌ల ద్వారా రూ. 37,299 వరకు ఆదా చేసుకోవచ్చు.

మోటరోలా ఫ్లిప్ ఫోన్ 6.9 అంగుళాల ఎల్‌టీపీఓ పీఓఎల్ఈడీ ఫోల్డబుల్ డిస్‌ప్లే వస్తుంది. అలాగే 120 హెచ్‌జెడ్ అధిక రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. ప్రధాన డిస్‌ప్లే 3,000 నిట్‌ల వరకు అద్భుతమైన పీక్ బ్రైట్‌నెస్‌తో పాటు హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్‌ను అందిస్తుంది. అదనంగా ఈ ఫోన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 3.6 అంగుళాల ఎక్స్‌టర్నల్ పీఓఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే గరిష్ట బ్రైట్‌నెస్ 1,700 నిట్‌లకు చేరుకుంటుంది. ముఖ్యంగా మోటరోలా రేజర్ 60ని బలమైన టైటానియం హింజ్‌తో అమర్చింది. ఈ ఫోన్ 5, 00,000 మడతల వరకు తట్టుకోగలదని కంపెనీ పేర్కొంది. 

మోటరోలా రేజర్ 60 ఐపీ48 రేటింగ్‌ను కూడా కలిగి ఉంది. అందువల్ల దుమ్ము, నీటి నుంచి రక్షణను అందిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ఎక్స్ చిప్‌సెట్‌ ద్వారా పని చేస్తుంది. 8 జీబీ+256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ఆండ్రాయిడ్-15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా హలో యూఐపై నడుస్తుంది.  ఫోటోగ్రఫీ ప్రియుల కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలుస్తుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 13 ఎంపీ అల్ట్రా-వైడ్ లేదా మాక్రో కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఆకట్టుకుంటుంది. అలాగే ఈ ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 30 వాట్స్ యూఎస్‌బీ టైప్-సీ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి