Soil Auction: గుప్పెడు మట్టికి రూ. 3.85 కోట్లు.. ఆ మట్టి స్పెషల్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..

|

Apr 19, 2022 | 7:21 AM

Moon Soil: రియల్ ఎస్టేట్.. రియల్ ఎస్టేట్.. రియల్ఎస్టేట్.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. భూమిపై గుంటెడు జాగ కొనాలంటే కష్టమైన పనిగా మారింది.

Soil Auction: గుప్పెడు మట్టికి రూ. 3.85 కోట్లు.. ఆ మట్టి స్పెషల్ ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..
Soil
Follow us on

Moon Soil: రియల్ ఎస్టేట్.. రియల్ ఎస్టేట్.. రియల్ఎస్టేట్.. ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఇదే మాట. భూమిపై గుంటెడు జాగ కొనాలంటే కష్టమైన పనిగా మారింది. ఆ రేంజ్‌లో ధరలు పెరిగాయి మరి. అయితే, ఈ సమస్యంతా సామాన్యులకే. మరి డబ్బున్నవారైతే.. భూమిపైనే కాదు.. ఇతర గ్రహాలపైనా స్థలాన్ని కొనేస్తున్నారు. అవును, చంద్రబాబుపై స్థలాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అక్కడ జీవించే వెసులుబాటు లేకపోయినప్పటికీ.. చంద్రుడిపై స్థలం కొనేందుకు ఎగబడుతున్నారు బడాబాబులు. ప్రస్తుతానికి చంద్రుడిపై ఇళ్లు కట్టుకునే వెలుసుబాటు లేకపోయినప్పటికీ.. భవిష్యత్ కాలంలో ఇది కావొచ్చని భావించి అక్కడ స్థలం కొనుగోలు చేస్తున్నారట!

ఇదిలాఉంటే.. అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టి తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్‌ సంస్థ బొన్‌హామ్స్‌ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్రుడి మట్టిని ఓ వ్యక్తి సుమారు 3.85 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్‌ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది.

Also read:

Tollywood Drugs Case: టాలీవుడ్‌ను వీడేదేలే అంటున్న ‘మత్తు’.. డ్రగ్స్ పోయి గంజాయ్ వచ్చే..

Big Shock: అమ్మాయిల వైపు అదే పనిగా చూస్తున్నారా? అయితే, ఈ వార్తపై కూడా ఓ లుక్కేయండి..!

Skin Care Tips: మొటిమలను వదిలించుకోవడానికి ఈ 3 మార్గాల్లో బియ్యం నీటిని ఉపయోగించండి