ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అందుబాటులోకి వచ్చాక ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏదీ మునుపటిలా లేదు. ఏఐ పుణ్యమా అని కొందరి ఉద్యోగాలకు ముప్పు వాటిళ్లగా.. మరి కొందరేమో దీని ప్రయోజనాలను అందిపుచ్చుకుంటున్నారు. మన చుట్టు ఉన్న ప్రపంచం మునుపటిలా లేదు. ఏఐ టెక్నాలజీతో ఎన్నో ఊహాత్మక చిత్రాలకు ప్రాణం పోస్టున్నారు నిపుణులు. తాజాగా సినీ రంగంలో ప్రముఖులు, క్రికెటర్ల దగ్గరి నుంచి ప్రపంచ కుబేరుల వరకు ఎన్నడూ కనీవినని రీతిలో ఊహాలకు రూపాన్నిచ్చారు. యువ నటీనటులను ముసలివాళ్లలా మర్చడం, క్రికెటర్లను అందగత్తెలుగా, ఇక అపర కుబేరులను బిచ్చగాళ్లగాను మర్చగలిగిన ఘనత ఏఐ టెక్నాలజీది. తాజాగా ఏఐ మాయాజాలంతో రూపొందించిన మరో ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
లియోనార్డో డావిన్సీ అద్భుత సృష్టి అయిన మోనాలిసా చిత్రం అది. ఎప్పుడూ ఒకటే ఫోజులో దర్శనమిచ్చే మోనాలిసా అందులో భారతీయ వంటకాలను ఆస్వాధిస్తున్నట్లు చూడొచ్చు. ఈ ఫొటోలో ఆమె ముందున్న టేబుల్‌పై రకరకాల భారతీయ వంటకాలు దర్శనమిస్తాయి. ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా ఏఐ టిక్నాలజీతో స్వయంగా రూపొందించిన ఈ చిత్రాన్ని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. నాడు డావిన్సీకి ఈ చిత్రం గీయడానికి ఏకంగా పదేళ్లు పట్టింది. నేడు చిటికెలో తయారు చేసేశాడు. ఇక ఈ ఫొటోపై నెటిజన్లు కామెంట్లతో నెట్టింట సందడి చేస్తున్నారు.
Ok I did this with AI.
Mona Lisa enjoying Indian Food. ? pic.twitter.com/sCCUZT5K9Z— Vikas Khanna (@TheVikasKhanna) June 3, 2023
Cooked by you?
— Prasanth Krishnan (@prasanth_rk) June 3, 2023
I thought so ..Biryani!!!! Hehehe.
— Archana Sikand (@ArchanaSikand) June 4, 2023
‘ఇది నిజంగా అద్భుతం’, ‘ఇండియన్ ఫుడ్ చాలా రుచిగా ఉంటుంది. మోనాలిసాకు ఖచ్చితంగా నచ్చుతుంది’, ‘అది ఖచ్చితంగా హైదరాబాద్ దమ్ బిర్యానీయే కదా!’ అంటూ పలువురు కామెంట్ సెక్షన్‌లో సరదాగా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంతకీ మీరేమంటారు..
మరిన్ని టెక్నాలజీ కథనాల కోసం క్లిక్ చేయండి.