సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యం మెటా సోషల్ మీడియాతో పాటు ఇటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ విషయంలోనూ దూకుడు మీదుంది. ఓవైపు సోషల్ మీడియాలో అద్భుతాలు సృష్టిస్తున్న మెటా తాజాగా ఎలక్ట్రానిక్ డివైజ్‌ల తయారీలోనూ వండర్స్ క్రియేట్ చేస్తోంది. మొన్నటి మొన్న స్మార్ట్ వాచ్‌ను విడుదల చేసిన మెటా తాజాగా మరో అద్భుతాన్ని ఆవిషృతం చేసింది. మెటా క్వెస్ట్ 3 పేరుతో వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది.
మెటా ఇటీవల నిర్వహించిన వార్షిక ఈవెంట్‌లో భాగంగా ఈ మిక్స్‌డ్ వర్చువల్ రియాలిటీ (MR) హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. మెటా క్వెస్ట్ 3 పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ హెడ్‌సెట్‌ను అడ్వాన్స్ బుకింగ్ కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక వచ్చే నెల 10వ తేదీ నుంచి ఈ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఈ హెడ్‌సెట్ ప్రారంభం ధర రూ. 41,552గా ఉండనుందని మెటా తెలిపింది. ఈ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ఫీచర్స్‌కు సంబంధించిన వివరాలను మెటా అధికారికంగా విడుదల చేసింది.
ఇదిలా ఉంటే మెటా నుంచి ఇది వరకే వచ్చిన క్వెస్ట్ 2 కంటే మెరుగైన క్వాలిటీతో క్వెస్ట్ 3ని రూపొందించారు. పాత దానికంటే కొత్తదాంట్లో 30 శాతం ఎక్కువ పిక్సెల్స్ క్లారిటీతో తీసుకొచ్చారు. స్నాప్‌డ్రాగన్ ఎక్స్‌ఆర్2 జెన్2 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్‌తో అద్భుతమైన క్లారిటీతో విజువల్స్‌ను వీక్షించవచ్చని మెటా చెబుతోంది. మెరుగైన సౌండ్ క్లారిటీతోపాటు, బాస్ పని తీరుతో ఈ హెడ్‌సెట్‌ను రూపొందించారు.
లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా మెటా క్విస్ట్3 పై డిస్కౌంట్ అందిస్తుందా అన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. క్విస్ట్2తో పోల్చితే కొత్త హెడ్‌సెట్‌లో 10 రెట్ల ఎక్కువ పిక్సెల్స్‌తో వీడియోను ప్లే చేస్తుంది. ఇక కంఫర్ట్ విషయంలోనూ క్విస్ట్ 3ని అద్భుంగా డిజైన్ చేశారు. ఇందులోని అడ్జెస్టబుల్ స్ట్రాప్ డిజైన్ ఆధారంగా మనకు నచ్చిన విధంగా హెడ్‌సెట్‌ను అడ్జెస్ట్ చేసుకోవచ్చు. ఇక సౌండ్‌కు ఇందులో ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా గేమింగ్‌తో పాటు బేస్ సౌండ్‌తో కూడిన వీడియోలు చూసేప్పుడు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..