Maruti Suzuki: 22 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కారు ఇప్పటికీ నెంబర్‌ వన్.. అమ్మకాలలో తగ్గని జోరు..!

|

May 05, 2022 | 12:53 PM

Maruti Suzuki: ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా విడుదలైంది. భారతదేశంలోని కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకి ఆధిపత్యం చెలాయిస్తోంది.

Maruti Suzuki: 22 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కారు ఇప్పటికీ నెంబర్‌ వన్.. అమ్మకాలలో తగ్గని జోరు..!
Maruti Wagon R
Follow us on

Maruti Suzuki: ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితా విడుదలైంది. భారతదేశంలోని కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకి ఆధిపత్యం చెలాయిస్తోంది. ఏప్రిల్‌లో మారుతికి చెందిన 7 వాహనాలు టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్‌లో చేరాయి. కానీ యూనిట్ విక్రయాల విషయానికొస్తే ఈ ఏప్రిల్ గతేడాది కంటే తక్కువ యూనిట్లను విక్రయించింది. అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 10 కార్లలో MPV విభాగంలోని ఎర్టిగా నిలిచింది. అత్యధిక వృద్ధిని నమోదు చేసిన టాప్‌ 10 కార్ల గురించి తెలుసుకుందాం.

1. మారుతి వ్యాగన్ఆర్

ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో వ్యాగన్ఆర్ మొదటి పేరు. ఏప్రిల్‌లో 17,766 యూనిట్ల కార్ల అమ్మకాలు జరిగాయి. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది వ్యాగన్‌ఆర్‌ విక్రయాల్లో 5 శాతం స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే 2022 మార్చిలో కంపెనీ 24,634 వ్యాగన్ఆర్ కార్లను విక్రయించింది.

2. మారుతి ఎర్టిగా

అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతీ ఎర్టిగా రెండో స్థానంలో ఉంది. ఏప్రిల్‌లో ఎమ్‌పివి సెగ్మెంట్‌లో ఎర్టిగా 14,889 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈసారి ఎర్టిగా విక్రయాల్లో 70 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ 2021లో మారుతీ మొత్తం 7000 ఎర్టిగాలను విక్రయించింది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.8.35 లక్షలు.

3. టాటా నెక్సాన్

ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడైన మూడో కారు టాటా నెక్సాన్. టాటా ఈ SUV కారు అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న కారుగా మారింది. ఏప్రిల్‌లో 13,471 యూనిట్ల నెక్సాన్‌లను విక్రయించింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 94 శాతం ఎక్కువ. ఏప్రిల్ 2021లో టాటా 6938 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

4. హ్యుందాయ్ క్రెటా

సెమీకండక్టర్ సవాళ్లను అధిగమించి హ్యుందాయ్ క్రెటా ఏప్రిల్‌లో అత్యధికంగా అమ్ముడైన నాలుగో కారుగా నిలిచింది. హ్యుందాయ్ క్రెటా 12,651 యూనిట్లను విక్రయించింది. హ్యుందాయ్ ఈ 5-సీట్ల SUV మార్చితో పోలిస్తే 15 శాతం వృద్ధిని నమోదు చేసింది.

5. మారుతి విటారా బ్రెజ్జా

మారుతి సబ్-కాంపాక్ట్ SUV విటారా బ్రెజ్జా అమ్మకాలు బాగానే కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌లో 11764 యూనిట్లను విక్రయించింది. అయతే మార్చిలో 12439 యూనిట్లను విక్రయించింది.

6. ఈ జాబితాలో ఆరో స్థానంలో మారుతి ఈకో, ఏడో స్థానంలో మారుతీ బాలెనో, ఎనిమిదో స్థానంలో మారుతీ డిజైర్, తొమ్మిదో స్థానంలో ఆల్టో, పదో స్థానంలో టాటా కొత్త మినీ ఎస్‌యూవీ పంచ్ ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Viral Video: ఈ పెళ్లికొడుకు డ్యాన్స్‌కి అందరు ఫిదా.. వీడియో చూస్తే ప్రశంసించకుండా ఉండలేరు..!

JIO: జియో 3 కొత్త ప్రీ పెయిడ్‌ ప్లాన్‌లు.. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌.. ఇంకా చాలా..!

Shigella Bacteria: షిగెల్లా బ్యాక్టిరియా ఎఫెక్ట్‌.. కేరళలో తొలి మరణం.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు..