Maruti Suzuki Jimny 7: త్వరలో భారత్ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతున్న 7 సీటర్.. ఇప్పటికే దేశంలో టెస్టింగ్స్..

|

Nov 29, 2022 | 9:20 AM

వాహన ప్రియుల ఆదరణ పొందిన  ప్రముఖ కంపెనీలలో మారుతీ సుజుకి కూడా ఒకటి. ఈ ప్రముఖ సంస్థకు చెందిన  వాహనాలలోలో మారుతి సుజుకి జిమ్నీ రానున్న రోజులలో భారత్‌లో కూడా..

Maruti Suzuki Jimny 7: త్వరలో భారత్ మార్కెట్‌లోకి లాంచ్ కాబోతున్న 7 సీటర్.. ఇప్పటికే దేశంలో టెస్టింగ్స్..
Maruti Suzuki Jimny 7
Follow us on

వాహన ప్రియుల ఆదరణ పొందిన  ప్రముఖ కంపెనీలలో మారుతీ సుజుకి కూడా ఒకటి. ఈ ప్రముఖ సంస్థకు చెందిన  వాహనాలలోలో మారుతి సుజుకి జిమ్నీ రానున్న రోజులలో భారత్‌లో కూడా లాంచ్ అవబోతుంది. భారతదేశంలో ఇది ఇప్పటివరకూ ఇంకా మార్కెట్‌లోకి రానప్పటికీ దీనికి భారత్‌లో మంచి ఆదరణ ఉంది. మన దేశంలో దీనికి మంచి ఫాలోయింగ్ కూడా ఉండడమే కాక దీని కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు కంపెనీ ఆటో ఎక్స్‌పో 2023లో భారతదేశంలో మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్‌ను విడుదల చేస్తుందని అందరూ భావించారు. అయితే త్వరలో దేశంలో 7-సీటర్ జిమ్నీని కూడా మనం చూడవచ్చు. మారుతి సుజుకి జిమ్నీ 5-సీటర్ ఆఫ్-రోడ్ లైఫ్‌స్టైల్ సెగ్మెంట్‌లో మహీంద్రా థార్‌కు ప్రత్యర్థిగా రాబోతుంది. మహీంద్రా 7-సీటర్ థార్‌ను పరీక్షిస్తున్నందున, ఆ విభాగంలో కూడా బ్రాండ్‌కు పోటీగా మారుతి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది.

రుష్‌లేన్ షేర్ చేసిన ఓ వీడియోలో అందరినీ ఆకర్షించేలా ఉన్న 7-సీటర్ మారుతి సుజుకి జిమ్నీ టెస్ట్ మ్యూల్‌ను భారతీయ రోడ్లపై చూడవచ్చు. టెస్ట్ మ్యూల్ స్పోర్ట్స్ బ్లాక్ కలర్‌లో, డోర్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్‌ను స్పష్టంగా చూడవచ్చు. కారు ముందు భాగం దాని కంపెనీ  5-డోర్ల  కారు మాదిరిగానే కనిపిస్తుంది. క్యాబిన్ లోపల, మారుతి సుజుకి జిమ్నీ 7-సీటర్ రెడ్ సీట్ కూడా ఉంటుంది. కారు ముందు వరుసలో మూడవ వరుస సీట్లను కూడా కలిగి ఉండడం దీని ప్రత్యేకత. బయటి నుండి కారు చాలా విశాలంగా కనిపిస్తుంది. అయితే లెగ్‌రూమ్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

అయితే మారుతి సుజుకి జిమ్నీ 7-సీటర్ వేరియంట్ కనిపించడం ఇదే మొదటిసారి. మహీంద్రా XUV700 SUV లాగానే ఆ కంపెనీ 7-సీటర్ వేరియంట్‌గా కూడా అందించవచ్చని  అనేక వార్తాకథనాలు  వెలువడుతున్నాయి.  కాగా, సుజుకి జిమ్నీ 3-డోర్ అనేక దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన మోడల్. దీన్ని దృష్టిలో ఉంచుకుని, బాగా ఆదరణ పొందుతున్న కార్లవైపు మొగ్గు చూపుతూ 7-సీటర్ వెర్షన్ కారును భారత మార్కెట్లో హిట్ చేయవచ్చని ఆ కంపెనీ ఆశించి ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..