LeEco S1 Pro: అచ్చు గుద్దినట్లు ఐఫోన్‌లా ఉన్న ఈ ఫోన్ ధర రూ. 10 వేలే.. ఫీచర్ల విషయంలో నో కాంప్రమైజ్‌.

|

Jan 16, 2023 | 7:59 AM

ఐఫోన్‌ 14 కొనుగోలు చేయాలంటే కనీసం రూ. లక్ష చెల్లించాల్సిందే. అయితే అచ్చంగా ఐఫోన్‌ 14 లుక్స్‌తో ఉన్న ఫోన్‌ కేవలం రూ. 10 వేలకే అందుబాటులో ఉంటే ఎలాం ఉంటుంది. ఏంటి రూ. 10 వేలకు ఐఫోన్‌ ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! కానీ ఇది నిజమే.. చైనాకు చెందిన LeEco అనే కంపెనీ..

LeEco S1 Pro: అచ్చు గుద్దినట్లు ఐఫోన్‌లా ఉన్న ఈ ఫోన్ ధర రూ. 10 వేలే.. ఫీచర్ల విషయంలో నో కాంప్రమైజ్‌.
Leeco S1 Pro
Follow us on

ఐఫోన్‌ 14 కొనుగోలు చేయాలంటే కనీసం రూ. లక్ష చెల్లించాల్సిందే. అయితే అచ్చంగా ఐఫోన్‌ 14 లుక్స్‌తో ఉన్న ఫోన్‌ కేవలం రూ. 10 వేలకే అందుబాటులో ఉంటే ఎలాం ఉంటుంది. ఏంటి రూ. 10 వేలకు ఐఫోన్‌ ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదూ! కానీ ఇది నిజమే.. చైనాకు చెందిన LeEco అనే కంపెనీ ఈ పనిని చేసి చూపించింది. అచ్చంగా ఐఫోన్‌ 14ని పోలి ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. LeEco S1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ చూడడానికి ఐఫోన్‌ 14ని పోలినట్లు ఉంటుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? భారత్‌లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌ ఈ స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ ఫోన్‌ను అచ్చంగా ఐఫోన్‌లా కనిపించడానికి ప్రధాన కారణం దీని కెమెరా అని చెప్పొచ్చు. LeEco S1 ప్రోలో రెయిర్‌ కెమెరాలో మూడు లెన్స్‌ని అందించారు. ఇక కెమెరా క్లారిటీ విషయానికొస్తే 13 మెగా పిక్సెల్‌ కాగా సెల్ఫీల కోసం 5 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 10 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

LeEco S1 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ సామర్థ్యంతో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌లో చైనాలో మాత్రమే తీసుకొచ్చారు. అయితే భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో చైనా కరెన్సీలో 899 యువాన్‌లుగా ఉంది. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 10,906గా ఉంది. 200 గ్రాముల బరువు ఉండే ఈ ఫోన్‌ 9.5 ఎమ్‌ఎమ్‌ మందంతో ఉంటుంది. మరి ఈ ఐఫోన్‌ను పోలిన స్మార్ట్ ఫోన్‌ భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..