
ఆఫ్‌లైన్ రిటైల్ వినియోగదారులను ఆకట్టుకునేలా Lava Aura Curve 5Gలో ప్రత్యేక డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లను అందించారు. వెనుకవైపు చిన్న AMOLED స్క్రీన్ ఉండటం ఈ ఫోన్లో మరో ప్రత్యేకత. నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్స్, బ్యాటరీ స్థాయి వంటి వివరాలను ఈ స్క్రీన్‌పై చూడొచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవంతో పాటు దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్స్ను కూడా కంపెనీ ప్రకటించింది.
Lava Aura Curve 5Gలో 6.67 అంగుళాల FHD+ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,100 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1920Hz PWM డిమ్మింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. పనితీరు కోసం MediaTek Dimensity 7100 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 6GB LPDDR5 RAM, 128GB UFS 2.2 స్టోరేజ్‌తో పాటు 6GB వర్చువల్ RAM సదుపాయం ఉంది. Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో థర్డ్‌పార్టీ బ్లోట్‌వేర్, ఇంటిగ్రేటెడ్ యాడ్స్ ఉండవని కంపెనీ తెలిపింది.
కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు 50MP Sony IMX752 ప్రధాన కెమెరా, EIS సపోర్ట్ ఉన్నాయి. 2K వీడియో రికార్డింగ్‌తో పాటు నైట్ మోడ్, ప్రో వీడియో, డ్యూయల్ వ్యూ వీడియో, స్పోర్ట్స్ మోడ్ వంటి ఫీచర్లు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13MP ఫ్రంట్ కెమెరా ఉంది.
ఈ ఫోన్లో 6,000mAh బ్యాటరీని అందించారు. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే రిటైల్ బాక్స్‌లో 33W ఛార్జర్ మాత్రమే లభిస్తుంది. వెనుకవైపు వేగన్ లెదర్ ఫినిష్‌తో వచ్చే ఈ ఫోన్ అంబర్ బ్లూ, హిమ్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది. Al-Si DT Star 2 కవర్ గ్లాస్, IP64 రేటింగ్, MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ కూడా ఉన్నాయి.
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, స్టీరియో స్పీకర్లు, IR బ్లాస్టర్, Wi-Fi 6E, Bluetooth 5.4 వంటి ఫీచర్లు ఉన్నాయి. Vayu AI సదుపాయాలతో పాటు రెండు సంవత్సరాల Android OS అప్‌గ్రేడ్స్, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ను లావా అందించనుంది.
6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.23,999. ఈ ఫోన్ దేశవ్యాప్తంగా లావా ఆఫ్‌లైన్ రిటైల్ పార్ట్నర్ నెట్వర్క్ ద్వారా విక్రయించబడుతుంది. కొనుగోలుదారులకు ‘Free Service @ Home’ పేరుతో డోర్‌స్టెప్ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది.