Youtube Update: హమ్‌ చేస్తే చాలు మీకు క్షణాల్లో మీకు నచ్చిన పాట.. యూట్యూబ్‌లో షాకింగ్‌ అప్‌డేట్‌

| Edited By: Ravi Kiran

Oct 23, 2023 | 1:00 PM

ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్‌ అయిన యూ ట్యూబ్‌ కూడా మ్యూజిక్‌ సేవలను అందిస్తుంది. అలాగే యూట్యూబ్‌ వీడియోల ద్వారా మనకు నచ్చిన పాటను వీక్షిస్తూ మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేసే సదుపాయం ఉండడంతో చాలా మంది పాటలను ఎంజాయ్‌ చేయడానికి యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. అయితే మనం ప్రయాణాల్లో ఉన్న సమయాల్లో మనకు నచ్చిన పాటను సెర్చ్‌ చేయడం ఇబ్బందిగా ఉంటుంది.

Youtube Update: హమ్‌ చేస్తే చాలు మీకు క్షణాల్లో మీకు నచ్చిన పాట.. యూట్యూబ్‌లో షాకింగ్‌ అప్‌డేట్‌
Youtube New Feature
Follow us on

ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకం విపరీతంగా పెరిగింది. అందుల్లో వచ్చే కొన్ని యాప్స్‌ మనకు చాలా బాగా నచ్చుతున్నాయి. గతంలో ఫోన్స్‌లో మనకు నచ్చిన పాటలను లోడ్‌ చేసుకుని నచ్చిన సమయంలో వినేవాళ్లం. అయితే క్రమేపి స్మార్ట్‌ఫోన్స్‌ రావడంతో డేటా లభ్యత పెరిగింది. దానికి అనుగుణంగా వివిధ మ్యూజిక్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వాటిల్లో మనకు నచ్చిన పాటను సెర్చ్‌ చేసుకుని వినే సదుపాయం ఉంది. ప్రముఖ వీడియో ప్లాట్‌ఫారమ్‌ అయిన యూ ట్యూబ్‌ కూడా మ్యూజిక్‌ సేవలను అందిస్తుంది. అలాగే యూట్యూబ్‌ వీడియోల ద్వారా మనకు నచ్చిన పాటను వీక్షిస్తూ మ్యూజిక్‌ ఎంజాయ్‌ చేసే సదుపాయం ఉండడంతో చాలా మంది పాటలను ఎంజాయ్‌ చేయడానికి యూట్యూబ్‌ను ఎంచుకుంటున్నారు. అయితే మనం ప్రయాణాల్లో ఉన్న సమయాల్లో మనకు నచ్చిన పాటను సెర్చ్‌ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపర్చేందుకు యూట్యూబ్‌ నయా అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. మనకు నచ్చిన పాటను హమ్‌ చేస్తే పాటలు డిస్‌ప్లే అయ్యేలా కొత్త ఫీచర్‌ను రూపొందించింది. ఈ తాజా ఫీచర్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

యూట్యూబ్‌ యాప్‌లో అంతర్నిర్మిత ఫీచర్‌ని అప్‌డేట్‌ చేసింది. ఈ ఫీచర్‌ మీ ఫోన్‌లో ఏదైనా పాటను హమ్ చేస్తే పాటను శోధించడానికి మీకు సాయం ఏస్తుంది. ఇది గూగుల్‌ శోధనలో గమనించిన హమ్-టు-సెర్చ్ ఫీచర్‌కి చాలా పోలి ఉంటుంది. ఈ ఫీచర్ గూగుల్‌ యాప్‌తో పాటు గూగు్‌ అసిస్టెంట్‌లో కూడా అందుబాటులో ఉంది. యూట్యూబ్‌ హమ్‌-టు-సెర్చ్‌ ఫీచర్ ఎలా పని చేస్తుందో? దశల వారీగా తెలుసుకుందాం.

  • స్టెప్‌- 1: యూట్యూబ్‌ యాప్‌ను తెరవాలి. 
  • స్టెప్‌- 2: ఎగువ కుడి వైపున ఉన్న శోధన చిహ్నంపై నొక్కాలి
  • స్టెప్‌- 3: మీరు సెర్చ్ బార్ పక్కన మైక్రోఫోన్ చిహ్నాన్ని ఎంచుకోవాలి. 
  • స్టెప్‌- 4: మీరు మైక్రోఫోన్‌పై నొక్కినప్పుడు మీరు పాట ట్యూన్‌ను హమ్ చేయవచ్చు. పాడవచ్చు లేదా విజిల్ ద్వారా కూడా చెప్పవచ్చు.
  • స్టెప్‌- 5: అప్పుడు యూట్యూబ్ మీరు ఊహించిన ఫలితాలను మీకు చూపుతుంది. అంతే సింపుల్‌గా మీరు మీకు నచ్చిన పాటను ఎంజాయ్‌ చేయవచ్చు.

ప్రస్తుతానికి భారతదేశంలోని యూట్యూబ్‌ వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉండకపోవచ్చు. యూట్యూబ్‌ బీటా వెర్షన్‌ వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్‌ డిస్‌ప్లే అవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీచర్‌ సక్సెస్‌ అయితే మరికొన్ని రోజుల్లో యూజర్లందరికీ ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..