ఇటీవల కాలంలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ వినియోగం బాగా పెరిగింది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ వంటి అనేక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ఇచ్చే కంటెంట్ కారణంగా వాటి వినియోగదారులు బాగా ఇష్టపడుతున్నారు. అయితే వాడకం వరకూ బాగానే ఉన్నా వాటి సబ్‌స్క్రిప్షన్ చార్జీలే వినియోగదారులను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో మొబైల్ రీచార్జ్ ధరలే బాగా పెరిగాయనుకుంటే గోరు చుట్టు మీద రోకలి పోటు అనే చందాన ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలు తయారయ్యాయి. అయితే తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ అయిన జియో వినియోగదారులకు వారి అపరిమిత డేటాతో పాటు స్ట్రీమింగ్ అవసరాలను తీర్చేలా ఎంచుకున్న ప్రీపెయిడ్ మొబైల్, ఫైబర్, ఎయిర్ ఫైబర్ ప్లాన్‌లతో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాలతో ఇతర ఓటీటీ ప్లాన్‌లను అందిస్తోంది. కాబట్టి జియో వినియోగదారులు ప్రత్యేక ఓటీటీ సభ్యత్వాల కోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకుండా 5జీ ఇంటర్నెట్ వేగం, కాలింగ్‌తో పాటు ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చు. ఆ ప్లాన్‌ల వివరాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఈ ప్లాన్ జియో వెల్‌కమ్ ఆఫర్‌తో అపరిమిత 5జీ డేటా, రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 84 రోజుల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ఈ ప్లాన్ జియో వెల్‌కమ్ ఆఫర్‌తో అపరిమిత 5G డేటా, రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 84 రోజుల పాటు ఉచిత నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ఈ ప్లాన్ కింద వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), జియోసినిమా, జియోసావ్న్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా 18 ఓటీటీ యాప్స్‌కు సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అలాగే 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ వేగంతో అదనపు సభ్యత్వాన్ని పొందుతారు.
ఈ ప్లాన్‌తో వినియోగదారులు గరిష్టంగా 500 ఎంబీపీఎస్ వేగంతో పాటు నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌తో సహా 16 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ పొందుతారు.
ఈ ప్లాన్ కింద 1 జీబీపీఎస్ వేగంతో 35000 జీబీ డేటా (35000 జీబీ+ 7500 జీబీ బోనస్) అందిస్తుంది. ఇది నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, ఇతరులతో సహా 19 యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్‌లో వినియోగదారులు 1 జీబీపీఎస్ వేగం, 6600 జీబీ డేటా అలవెన్స్‌ని పొందవచ్చు. సబ్‌స్క్రైబర్‌లు నెట్‌ఫ్లిక్స్ (స్టాండర్డ్), అమెజాన్ ప్రైమ్, మరిన్నింటితో సహా 19 యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను అందుకుంటారు.
ఈ ప్లాన్‌లో 550 ప్లస్ డిజిటల్ ఛానెల్‌లకు ఉచిత యాక్సెస్‌తో పాటు 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ను అందిస్తుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమా యాక్సెస్‌తో పాటు ఇతర ఓటీటీ యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ఈ ప్లాన కింద ఎంపిక చేసిన లొకేషన్‌లకు జియో మ్యాక్స్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల వ్యాలిడిటీతో 300 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌ని పొందుతారు. అదనంగా నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ప్రైమ్ వీడియోలు, డిస్నీ+ హాట్‌స్టార్, సోనీ లివ్, జీ5, ఇతర వాటితో సహా 550 ప్లస్ డిజిటల్ ఛానెల్స్‌తో పాటు ఓటీటీ యాప్‌లకు యాక్సెస్‌ను పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..