5G Services Launched: దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న 5జీ సేవలు.. ఏపీలో మరో రెండు ప్రాంతాల్లో అందుబాటులోకి..

|

Jan 11, 2023 | 4:39 AM

5G Services Launched: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌లు 5జీ సేవలను అందిస్తుండగా.. దశలవారీ ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. పట్టణప్రాంతాలకు సైతం 5జీ సేవలను విస్తరిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దేశంలోని మరో 10 నగరాల్లో..

5G Services Launched: దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న 5జీ సేవలు.. ఏపీలో మరో రెండు ప్రాంతాల్లో అందుబాటులోకి..
Jio True 5g Services
Follow us on

5G Services Launched: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌లు 5జీ సేవలను అందిస్తుండగా.. దశలవారీ ఈ సేవలను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. పట్టణప్రాంతాలకు సైతం 5జీ సేవలను విస్తరిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో దేశంలోని మరో 10 నగరాల్లో 5జీ సర్వీసెస్‌ను లాంచ్ చేసింది . వీటిలో ఆంధ్రప్రదేశ్‍లోని మరో రెండు పట్టణాల్లో జియో ట్రూ 5జీ నెట్‍వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. నెల్లూరు, తిరుపతి పట్టణాల్లో జియో 5జీ సేవలు తాజాగా ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‍లో జియో 5జీ సర్వీసెస్‌ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య ఆరుకు చేరింది. ఆంధ్రప్రదేశ్‍లోని తిరుపతి, నెల్లూరులో జియో ట్రూ 5జీ సర్వీస్‍లను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. కాగా, గత నెలలోనే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు నగరాల్లో జియో 5జీ లాంచ్ అయింది. ఇప్పుడు మరో రెండు చోట్ల అందుబాటులోకి రావటంతో.. ఏపీలో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య ఆరుకు చేరింది. జియో ప్రస్తుతం 5జీ వెల్కమ్ ఆఫర్ అందుబాటులో ఉంచింది. దీంట్లో భాగంగా జియో5జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 5జీ ఫోన్లు వాడుతున్న వారు ఉచితంగా అన్‍లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు.

ఈ ఏడాది చివరి కల్లా ఆంధ్రప్రదేశ్‍లోని అన్ని నగరాలు, మండలాలు, గ్రామాల్లో 5జీని అందుబాటులోకి తెస్తామని జియో ప్రకటించింది. 5జీ కోసం ఏపీలో అదనంగా రూ.6,500 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. నెల్లూరు, తిరుపతితో పాటు దేశంలోని మరో 8 నగరాల్లో జియో 5జీ సర్వీస్‍లు అందుబాటులోకి వచ్చాయి. మీరట్‌, ఆగ్రా, కాన్ఫూర్‌, ప్రయాగ్‍రాజ్, నాగ్‍పూర్, అహ్మద్‍నగర్, కోజీకోడ్, త్రిస్సూర్ నగరాల్లో 5జీని అందుబాటులోకి తెచ్చింది జియో. దీంతో దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా 85 నగరాల్లో జియో 5జీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ఏడాది చివరి కల్లా దేశవ్యాప్తంగా 5జీ నెట్‍వర్క్ ను విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజి వార్తల కోసం చూడండి..