Blue Origin: బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం.. నింగిలోకి 18 ఏళ్ల కుర్రాడు

| Edited By: Subhash Goud

Jul 16, 2021 | 10:43 AM

Blue Origin: అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం అయింది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి ప్రభుత్వం గ్రీన్‌..

Blue Origin: బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం.. నింగిలోకి 18 ఏళ్ల కుర్రాడు
Follow us on

Blue Origin: అపర కుబేరుడు బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్ష యాత్రకు మార్గం సుగమం అయింది. జెఫ్ బెజోస్ సహా మరో ముగ్గురి అంతరిక్ష విహారానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో వచ్చే మంగళవారం పశ్చిమ టెక్సాస్ నుంచి ‘న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా ‘సబ్ ఆర్బిటల్’ యాత్ర చేయనున్నారు. న్యూ షెపర్డ్’ రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్లే వారి జాబితాలో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు, 82ఏళ్ల వాలీ ఫంక్‌తో 18 ఏళ్ల కుర్రాడు ఉన్నాడు. అయితే ఈ 18 ఏళ్ల కుర్రాడి పేరు ఆలివర్ డెమెన్. అంతరిక్ష యాత్ర కోసం ఆలివర్ డెమెన్.. బ్లూ ఆరిజిన్‌ సంస్థకు డబ్బులు చెల్లించాడు. ఈ క్రమంలో ఆలివర్ డెమెన్.. అంతరిక్ష యాత్ర చేయనున్న మొదటి కస్టమర్‌గా నిలవడంతోపాటు, అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందనున్నాడు. గతంలో దివంగత సోవియట్ వ్యోమగామి గెర్మాన్ టిలోవ్‌ 25 ఏళ్లకే రోదసి యాత్ర చేసి, అంతరిక్షయానం చేసిన అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు ఈ 18 ఏళ్ల ఆలివర్‌ డెమెన్‌ అంతరిక్షంలో ప్రయాణం చేయనున్నాడు.

ఆదివారం వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన వీఎస్ఎస్ యూనిటీ-22 వ్యోమనౌక అంతరిక్ష యాత్రకు వెళ్లి క్షేమంగా తిరిగొచ్చింది. ఇందులో వర్జిన్ గెలాక్టిక్ అధిపతి రిచర్డ్ బ్రాన్సన్, గుంటూరు మూలాలున్న తెలుగు యువతి బండ్ల శిరీషతోపాటు మరో నలుగురు రోదసీలోకి వెళ్లారు. యూనిటీ అంతరిక్ష నౌక భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి రోదసీగా భావించే కర్మాన్ రేఖను దాటి రాగా, న్యూషెపర్డ్ 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లనుండడం గమనార్హం. కాగా, ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ కూడా త్వరలోనే అంతరిక్ష యాత్ర చేపట్టనుంది.

 

ఇవీ కూడా చదవండి:

Gaganyaan: గగన్ యాన్ మూడో దశ పరీక్షలు విజయవంతం..మనవులను అంతరిక్షంలోకి పంపడం కోసం మరో ముందడుగు!

WhatsApp Accounts Banned: కస్టమర్లకు షాకింగ్‌.. భారత్‌లో 20 లక్షల వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం.. కారణం ఏంటంటే..!