PSLV-C59/Proba-3 Mission: చివరి నిమిషంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే..

|

Dec 04, 2024 | 4:00 PM

పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగాన్ని రేపటికి వాయిదా వేసినట్లు ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) వెల్లడించింది.

PSLV-C59/Proba-3 Mission: చివరి నిమిషంలో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా.. కారణం ఏంటంటే..
Pslv C59 Proba 3 Mission
Follow us on

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కమర్షియల్ రాకెట్ ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిచిపోయింది.. బుధవారం పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగం వాయిదా పడింది. ప్రోబా-3 ఉపగ్రహంలో సాంకేతిక లోపం గుర్తించడంతో పీఎస్‌ఎల్వీ సీ-59 రాకెట్‌ ప్రయోగాన్ని వాయిదా వేసినట్లు ఇస్రో (భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) వెల్లడించింది. రాకెట్ ప్రయోగానికి ముందు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా ఉపగ్రహంలో సమస్యను గుర్తించింది.. దీంతో చివరి నిమిషంలో రాకెట్ ప్రయోగాన్ని నిలిపివేశారు. తిరిగి రేపు సా.4:12కు PSLV C-59 రాకెట్‌ ప్రయోగం జరగనుంది.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం- షార్‌‌లో ఈ రోజు (బుధవారం) సాయంత్రం 4 గంటల 08 నిమిషాలకు పీఎస్ఎల్వీ-సీ59 రాకెట్‌ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో వెల్లడించింది.. యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహాన్ని ఈ రాకెట్ కక్ష్యలోకి చేర్చనున్నట్లు తెలిపింది.. సరిగ్గా ప్రయోగానికి ముందు ప్రోబాలో సాంకేతిక లోపం ఉన్నట్లు గుర్తించడంతో.. దీనిని గురువారానికి వాయిదా వేశారు.. గురువారం సాయంత్రం 4.12 నిమిషాలకు ప్రయోగం నిర్వహించనున్నారు.

సూర్యుడిపై అధ్యయనం..

యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 ఉపగ్రహం సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. సూర్యకిరణాలను అధ్యయనం చేసే మిషన్‌.. ప్రోబా -3 లో రెండు శాటిలైట్లు ఉన్నాయి.. 310 కేజీల బరువుండే కరోనా గ్రాఫ్‌ స్పేస్‌ క్రాఫ్ట్‌, 240 కేజీల ఓకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ .. ఈ జంట శాటిలైట్లు కక్ష్యలో లాబోరేటరీలా పనిచేస్తాయి. ఈ రెండు కలిసి కృత్రిమ సూర్య గ్రహణాన్ని సృష్టిస్తాయి. ఆ తర్వాత ఆ కృత్రిమ గ్రహణాన్ని అధ్యయనం చేయనున్నాయి.

శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు..

కాగా.. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. PSLV సీ-59 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని శ్రీవారికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలు ప్రతీ ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమల శ్రీవారి ఆశీస్సులతో పాటు దేశ ప్రజల ఆశీస్సులు, మద్దతు తమకుండాలని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశిస్తున్నారు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..