Mission Aditya: తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్-1 ప్రయాణం

|

Nov 25, 2023 | 8:22 PM

చంద్రయాన్ - 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్-1 ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్‌కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు.

Mission Aditya: తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్-1 ప్రయాణం
Isro Chairman Somnath Reveals New Information About Mission Aditya
Follow us on

చంద్రయాన్ – 3 తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో మిషన్ ఆదిత్య. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య మిషన్‌ను ఇస్రో చేపట్టింది. ఈ క్రమంలో ఆదిత్య ఎల్-1 ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. జనవరి 7 కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్-1 పాయింట్‌కు చేరుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. ప్రస్తుతం తుది ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వివరాలను వెల్లడించారు.

సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్‌ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..