మగ కావాలా.. ఆడ కావాలా అంటే అంతా ఆడ కావాలనేవారి సంఖ్య చాలా పెరిగింది. ఇదేంటో లెక్క మారిందని కన్ఫ్యూజ్ కాకండి. ఇది కోళ్ల వ్యాపారం చేసేవారి గురించి. పౌల్ట్రీ వ్యాపారంలో ప్రతి బిజినెస్ మెన్ కోరుకునేది ఇదే. ఎందుకంటే గుడ్ల ఉత్పత్తికి మగ కోడి పిల్లలు పనికిరావు. అందుకే వీరు ఆడ కోడి పిల్లలను పెంచి పెద్ద చేసి.. అవి ఇచ్చే గుడ్లను మార్కెట్లోకి దింపుతుంటారు. అయితే ఇప్పటి వరకు పొదిగిన గుడ్డు నుంచి ఏ కోడి పిల్ల వస్తుందో ముందే చెప్పలేరు. ఇకముందు అలా కాదు.. మీరు కోరిన మీరు కోరుకున్న కోడి పిల్ల.. అంటే పౌల్ట్రీ రంగం కోరుకున్న ఆడ కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు సరికొత్త ఆవిష్కరణ శ్రీకారం చుట్టారు. మగ కోడి పిల్లలు పుట్టకుండా జన్యు మార్పులను చేశారు. సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే బై ప్రొడక్ట్ కింద లెక్క. అంటే ఏదైనా ప్రయోగంలో అసలు ఉత్పత్తి కాకుండా.. అదనంగా వచ్చేవి. ఇవి ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు.
పౌల్ట్రీలో మాత్రం మగ కోడి పిల్లలూ ఎందుకూ పనికిరావు అని మనలో చాలా మందికి డౌట్ రావొచ్చు. అందుకే గుడ్లు పొదిగిన తర్వాత అవి మగవైతే వెంటనే చంపేస్తారు. ఇలా చేయడం కొంత ఇబ్బందిగా మారినా.. వారి పౌల్ట్రీ వ్యాపారికి పెద్ద దెబ్బగా మారుతుంది. ఆ మగ కొడి పిల్లలను కనీసం మాంసం కూడా పనికి రాదు. వాటి నుంచి వచ్చే మాంసం కూడా ఆశించిన విధంగా ఉండదు. దాదాపు తినడానికి పనికిరాదు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఏటా వందల కోట్ల మగ కోడి పిల్లల్ని చంపేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని వాల్కని ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తలు.. కేవలం గుడ్లు పొదిగే కోడి పిల్లలు మాత్రమే పుట్టేలా వాటి జన్యువుల్ని సవరించి సత్ఫలితాలు సాధించారు. తాజా పరిశోధనతో కోట్లాది మగవాటిని చంపే పరిస్థితి పోతుంది. ఈ జన్యు సవరణ పరిశోధన అద్భుతాలు సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం