ISS: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న నాసా!

|

Jul 30, 2021 | 12:46 PM

అంతరిక్షంలో వ్యోమగాముల నివాసమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో గురువారం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఇది దాని కక్ష్యలో (కక్ష్య)లో 45 నిమిషాలపాటు కొద్దికొద్దిగా చలించింది.

ISS: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న నాసా!
Iss
Follow us on

ISS: అంతరిక్షంలో వ్యోమగాముల నివాసమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో గురువారం ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఇది దాని కక్ష్యలో (కక్ష్య)లో 45 నిమిషాలపాటు కొద్దికొద్దిగా చలించింది. తరువాత నాసా నియంత్రణ కేంద్రాలలోని విమాన బృందం కంట్రోల్ థ్రస్టర్ల సహాయంతో స్టేషన్‌ను దాని స్థానానికి చేర్చింది. అంతరిక్ష పరిశోధక కేంద్రం గరిష్టంగా సెకనుకు అరడిగ్రీ వేగంతో కదిలినట్లు నాసా వెల్లడించింది.

రష్యన్ లాబొరేటరీ మాడ్యూల్ షిప్ లో సాంకేతిక లోపం కారణంగా ఈ సంఘటన జరిగింది. ఈ రష్యన్ షిప్ ఇటీవల ఐఎస్ఎస్ కి జోడించారు.  దాని జెట్ థ్రస్టర్‌లు స్వయంచాలకంగా కదిలాయి. దీంతో ISS అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నియంత్రణలో కొద్దీ సేపు లేకుండా పోయింది. ఐఎస్ఎస్ లో ప్రస్తుతం 7 మంది సిబ్బంది ఉన్నారు.

నాసా  స్టార్‌లైనర్ క్యాప్సూల్ ప్రయోగం వాయిదా.. 

నాసా బోయింగ్ CST-100 స్టార్‌లైనర్ క్యాప్సూల్ లాంచ్ కోసం కౌంట్‌డౌన్ ప్రారంభించాల్సి ఉంది. ఇది కూడా  ఐఎస్ఎస్ తో కనెక్ట్ అవ్వవలసి ఉంది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే దీనిని వాయిదా వేశారు.  ఇప్పుడు దీని ప్రారంభం ఆగస్టు 3 న చేయాలని నిర్ణయించారు. ఏదైనా కారణాలతో ఆ రోజు వాయిదా పడితే, అది ఆగస్టు 4 న జరుగుతుంది.  ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్ లాక్‌హీడ్ మార్టిన్ కార్ప్ అట్లాస్ V రాకెట్‌పై స్టార్‌లైనర్ ప్రయోగించాల్సి ఉంది.

ఐఎస్ఎస్ స్టేషన్‌లో ప్రస్తుతం ఇద్దరు రష్యన్లు, ముగ్గురు అమెరికన్లు, ఒక జపనీస్, ఒక ఫ్రెంచ్ వ్యోమగామి ఉన్నారని నాసా ట్లేయిపింది. నాసా సిబ్బందికి ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది.  45 నిమిషాల సంఘటనలో నాసా గ్రౌండ్ బృందం రెండుసార్లు సిబ్బందితో సంబంధాన్ని కోల్పోయింది. కాని ప్రమాదం నుండి బయటపడింది. నౌకా మాడ్యూల్ థ్రస్టర్‌లలో లోపం ఏమి జరిగిందనే దానిపై ఇంతవరకు సమాచారం రాలేదు.

Also Read: NASA: రహస్యాల శోధనలో నాసా సరికొత్త ముందడుగు..అతి దగ్గరగా సూర్యుని ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్!

ఇలా కనిపించి అలా మాయమైన నక్షత్రాలు..!! గ్రహాంతర వాసుల ఓడలు అంటున్న పరిశోధకులు.. వీడియో