ఎలన్ మస్క్ సారధ్యంలోని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కు మెటా అనుబంధ ఇన్‌స్టాగ్రామ్ సవాల్ విసరబోతోంది. వచ్చే నెలాఖరు నాటికి ఇన్‌స్టాగ్రామ్ ఆధ్వర్యంలో తయారైన యాప్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. కొన్ని నెలలుగా మార్క్ జుకర్ బర్గ్ సారధ్యంలోని మెటా.. సెలెక్టెడ్ సెలబ్రిటీలు, క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్లతో ప్రయోగాత్మకంగా ఈ యాప్’ను పరీక్షిస్తోంది.
ముందుగా టెక్ట్స్ ఆధారిత యాప్‌గా రానుంది. అటుపై వీడియోలు, ఫొటోలు కూడా అప్ లోడ్ చేసుకోవచ్చని సమాచారం. ఇందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు కూడా వెలుగు చూశాయి. ఇప్పటికైతే అధికారికంగా ఈ యాప్‌కు మెటా పేరు పెట్టలేదు. అయితే `పీ92`, `బార్సిలోనా` అనే ఇంటర్నల్ పేర్లతో పిలుస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల ఖాతాలతో కనెక్ట్ కావడానికి మెటా వెసులుబాటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలోనే ట్విట్టర్‌కు పోటీ యాప్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని సమాచారం.
క్యారెక్టర్ లిమిట్ ఎంతంటే..
అయితే ఈ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ను పోలి ఉంటుందని, ఫొటోలు, వీడియోలతో కూడిన ఫీడ్‌కు బదులు టెక్ట్స్ ఆధారిత టైమ్ లైన్ పోస్ట్‌లు కనిపించవచ్చు. ట్విట్టర్‌నే పోలి ఉండటంతోపాటు 500 అక్షరాల వరకు టెక్ట్స్ రాసుకోవడం, ఫొటోలు, వీడియోలను జత చేయడానికి చోటు కల్పిస్తారని సమాచారం.
Meta’s been briefing creators on it’s upcoming text-based app — now looking at a possible late June launch.
Details are in my newsletter but I’ll list some highlights ? pic.twitter.com/KYqqXjrRmD
— Lia Haberman (@liahaberman) May 19, 2023
ప్రాథమిక యాప్ వివరణ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన UCLAలోని సోషల్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఇన్‌స్ట్రక్టర్ లియా హేబెర్‌మాన్ ప్రకారం.. రాబోయే యాప్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి వేరుగా ఉంటుంది. కానీ ఖాతాలను లింక్ చేసే ఎంపికతో జూన్‌లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో Mastodon వంటి ఇతర Twitter పోటీదారు యాప్‌లకు అనువర్తనాన్ని అనుకూలంగా ఉండేలా చేయడానికి ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి