PI BEEM: ఇది సైకిల్‌కు ఎక్కువ‌.. స్కూట‌ర్‌కు త‌క్కువ‌.. గంట‌కు 25 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణం..

|

Feb 17, 2021 | 11:23 AM

PI BEEM: ఐటి మద్రాస్- ఇంక్యుబేటెడ్ స్టార్ట్అప్ (Pi Beam) పై బీమ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్ కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది.

PI BEEM: ఇది సైకిల్‌కు ఎక్కువ‌.. స్కూట‌ర్‌కు త‌క్కువ‌.. గంట‌కు 25 కిలోమీట‌ర్ల వేగంతో ప్రయాణం..
Follow us on

PI BEEM: ఐటి మద్రాస్- ఇంక్యుబేటెడ్ స్టార్ట్అప్ (Pi Beam) పై బీమ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసింది. ఇది స్మార్ట్‌ఫోన్ కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జి చేస్తే సుమారు 50 కిలోమీటర్ల వ‌ర‌కు ప్రయాణిస్తుంది. దీనిని యుటిలిటీ ఇ-బైక్ అని పిలుస్తారు, ఈ ఎల‌క్ట్రిక్ సైకిల్‌కి ఎలాంటి లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ బైక్ వ్యక్తిగత లేదా వాణిజ్య అవసరాలను లక్ష్యంగా రూపొందించారు. కీలకమైన బ్యాటరీలు, కంట్రోలర్‌లతో సహా ఇత‌ర ఉత్పత్తి భాగాలలో 90% భారతదేశంలోనే తయారవుతున్నాయి.

తద్వారా మేక్ ఇన్ ఇండియా స్పిరిట్‌ను పూర్తిగా రూపొందించిన బైక్‌ల‌లో ఇదీ ఒక‌టి. పై బీమ్ ఈ సైకిల్ వ‌చ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) చివరి నాటికి 10,000 వాహనాలను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. పిమో ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఎంట్రీ లెవ‌ల్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌గా భావించ‌వ‌చ్చు. ఇది గంటకు 25 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. సీట్ల వద్ద డ్యూయ‌ల్ స‌స్పెన్షన్ ఉంటుంది. ఈ సైకిల్ ధ‌ర‌లు ఇంకా వెల్లడించలేదు. కాగా పై బీమ్ సంస్థ ఇప్పటివ‌ర‌కు ఇ-ట్రైక్, పెడల్ అసిస్ట్‌తో కూడిన 3 వీలర్, ఇ-కార్ట్ వెహిక‌ల్ క్లౌడ్ కనెక్టివిటీతో కూడిన పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం, అలాగే డేటా క్యాప్చర్ కోసం ఇన్‌బిల్ట్ సెన్సార్లు ఇ-ఆటో వంటి మూడు ఉత్పత్తులు ఉన్నాయి.

ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి..