Infinix note 11 pro: తక్కువ ఖరీదు.. ఎక్కువ ఫీచర్లు.. ఇన్ఫినిక్స్ నోట్ 11.. నోట్ 11 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెషాలిటీస్!

ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్ కింద ఇన్ఫినిక్స్ నోట్ 11.. నోట్ 11 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిఈ ఫోన్ల డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది.

Infinix note 11 pro: తక్కువ ఖరీదు.. ఎక్కువ ఫీచర్లు.. ఇన్ఫినిక్స్ నోట్ 11.. నోట్ 11 ప్రో స్మార్ట్ ఫోన్ స్పెషాలిటీస్!
Infinix Note 11 Pro

Updated on: Oct 17, 2021 | 12:30 PM

Infinix note 11 pro: న ఇన్ఫినిక్స్ నోట్ సిరీస్ కింద ఇన్ఫినిక్స్ నోట్ 11.. నోట్ 11 ప్రో పేరుతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిఈ ఫోన్ల డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంది. వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. అలాగే, వినియోగదారులు ఈ ఫోన్లలో 2TB మైక్రో SD కార్డ్ వరకు ఉంచవచ్చు. దీంతో పాటు ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేద్ధాం రండి!

ఇన్ఫినిక్స్ నోట్ 11, నోట్ 11 ప్రో ధర వెల్లడించలేదు. కానీ వాటి వేరియంట్ల గురించి సమాచారం ఇలా ఉంది. నోట్ 11 స్మార్ట్‌ఫోన్ స్నో వైట్, బూడిద రంగు, గ్రాఫైట్ బ్లాక్ రంగులలో వస్తుంది. నోట్ 11 ప్రో హేజ్ గ్రీన్, మిస్ట్ బ్లూ, మిథ్రిల్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఇన్ఫినిక్స్ నోట్ 11, నోట్ 11 ప్రో స్పెసిఫికేషన్‌లు

MediaTek Helio G96 ప్రాసెసర్ ఇన్ఫినిక్స్ నోట్ 11 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించారు. ఇది 8 GB RAM వరకు వస్తుంది. అదనంగా, వినియోగదారులు 128 GB UFS 2.2 స్టోరేజ్‌ని ఇందులో పొందుతారు. ఇది 2TB వరకు మైక్రో SD కార్డ్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ర్యామ్ విస్తరణ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇది ర్యామ్‌ను 8 GB నుంచి 11 GB వరకు పెంచుకునే వీలుంటుంది. ఈ పరికరంలో గ్రాఫిన్ ఫిల్మ్ ఉపయోగించారు. ఇది చిప్‌సెట్‌ను చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది.

ఇన్‌ఫినిక్స్ నోట్ 11 ప్రోలో 6.95-అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ ఎల్‌సిడి ప్యానెల్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేటును కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే TUV Rheinland సర్టిఫికెట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇది ఛార్జింగ్ కోసం 33W ఫాస్ట్ ఛార్జర్‌ను పొందుతుంది.

కెమెరా సెటప్ గురించి చూస్తె కనుక, ఇన్‌ఫినిక్స్ నోట్ 11 ప్రో వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అయితే 13 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంది. ఇది 30 ఎక్స్ డిజిటల్ జూమ్‌తో వస్తుంది. అలాగే ఇది 2 మెగాపిక్సెల్స్ డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వబడింది.

ఇన్ఫినిక్స్ నోట్ 11 స్పెసిఫికేషన్ గురించి చూస్తె, దాని స్పెసిఫికేషన్‌లు కూడా ఇన్‌ఫినిక్స్ నోట్ 11 ప్రో లాగా ఉంటాయి. కానీ బ్యాక్ ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్స్, రెండవ కెమెరా 2 మెగాపిక్సెల్ లెన్స్ తోనూ వస్తుంది.

Also Read: Festival Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నేడు, రేపు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే..

Energy Crisis: రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఎనర్జీ సంక్షోభం.. కారణాలు తెలుసుకోండి!