ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తాజాగా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. నోట్ 30 వీఐపీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. జూన్ 13వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చారు. 5జీ నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ ఫోన్‌ను 8GB,12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. గ్లేసియర్ వైట్, మ్యాజిక్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 24,600గా ఉంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 2,400 x 1,080 పిక్సెల్స్‌తో కూడిన 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 13, ఎక్స్‌ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8050 SoC ప్రాసెసర్‌ను అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతోపాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 68 వాట్స్ వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని ఇచ్చారు. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేయడం విశేషం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..