Mobiles Usage: ప్రస్తుతం మొబైల్ వినియోగం భారీగా పెరిగిపోయింది. చిన్నా నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఇక యువత, పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్‌లను భారీగా వినియోగిస్తున్నారు. ఎంతో మంది ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు మొబైల్ ఫోన్ (Mobile Phone)లలో గడిపేస్తున్నారు. ప్రస్తుతం కాలంలో స్మార్ట్‌ఫోన్ (Smartphone)లు లేనిది కొన్ని పనులు జరిగే అవకాశం లేదు. ఇక 2021లో భారతీయులు ప్రతి రోజు సగటున 4.42 గంటలు స్మార్ట్‌ఫోన్‌తోనే గడుతున్నారని అధ్యయనం ద్వారా తేలింది. ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ చానెళ్లు 3.17 గంటలు మాత్రమే వీక్షించినట్లు అమెరికా కేంద్రంగా ఉన్న అధ్యయన నివేదిక తెలిపింది. స్మార్ట్‌ఫోన్ అత్యధికంగా వాడుతున్న వారిలో బ్రెజిలియన్లు మొదటి స్థానంలో ఉన్నారు. వారు ప్రతిరోజు సగటున 5.24 గంటల పాటు మొబైళ్లతోనే కాలక్షేపం చేస్తున్నట్లు వెల్లడించింది.
గత సంవత్సరం భారతీయుల వద్ద మొబైల్ ఫోన్‌లలో 96 శాతం ఆండ్రాయిడ్ ఫోన్లు, బ్రెజిల్ వాసుల్లో 86 శాతం మంది వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న యాప్ సంస్థ అన్నీ అలియాస్ డేటా ఏఐ (US-based company data.ai))ఆధ్వర్యంలో కృత్రిమ మేథ ఆధారంగా ప్రపంచ దేశాల్లో మొబైళ్ల వాడకంపై అధ్యయనం నిర్వహించింది. 2020తో పోలిస్తే చైనా, అర్జెంటీనాల్లో మొబైల్ ఫోన్ల వాడకం తగ్గుముఖం పట్టింది. చైనీయులు 2020లో 3.5 గంటల పాటు స్మార్ట్‌ఫోన్‌లతో గడిపితే, గత సంవత్సరం 3.2 గంటలకు పడిపోయినట్లు అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇక అర్జెంటీనాలలో 3.8 గంటల నుంచి 3.6 గంటలకు పడిపోయింది.
భారత్‌లో కరోనా సమయంలో..
ఇక భారత్‌లో కోవిడ్ సమయంలో స్మార్ట్‌ఫోన్లు 120 కోట్లు పెరిగాయి. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ప్రతి 10 నిమిషాలకు 4.6 నిమిషాలు సోషల్ మీడియా, కమ్యూనికేషన్‌కు సంబంధించిన యాప్స్‌పైనే కాలం వెళ్లదీశారు. మరో 3.5 నిమిషాలు ఫోటో, వీడియో, గేమింగ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యాప్స్, ఫోటో అండ్ వీడియో యాప్స్‌పై 2.5 నిమిషాలు గడిపారు.
భారత్‌లో పెరిగిన డౌన్‌లోడ్ శాతం..
ఇక భారతదేశంలో గత ఏడాదిలో అంటే 2021లో డేటా డౌన్‌లోడ్ 10 శాతం పెరిగినట్లు అధ్యయనం ద్వారా తేలింది. డేటా డౌన్‌లోడ్‌లో చైనా తర్వాత భారత్ ఉంది. పాకిస్థాన్ 25 శాతం, పెరూ 25 శాతం, ఫిలిప్పీన్స్ 25 శాతం, వియత్నం 20 శాతం చొప్పున డౌన్‌లోడ్స్ పెరిగాయి. 2020లో అన్ని కేటగిరిలపై ఫైనాన్స్ యాప్స్ డౌన్‌లోడ్స్ శరవేగంగా 27 శాతం పెరిగి, వాటి వాడకం 46 శాతం వృద్ధి చెందింది. అలాగే మెడికల్ యాప్స్ డౌన్‌లోడ్స్ 36 శాతం, వాటి వినియోగం 38 శాతంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి.
భారత్ వినియోగదారులు మొబైళ్లపై చేసిన ఖర్చు ఎంతంటే..
ఇక భారత్‌కు చెందిన వినియోగదారులు మొబైల్‌ఫోన్‌లపై 2021 సంవత్సరంలో 417 మిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. 2020లో 503 బిలియన్ల డాలర్లు ఖర్చు చేయగా, చైనాలో 56 బిలియన్ డాలర్లు, అమెరికాలో 43 బిలియన్ల డాలర్లు, జపాన్‌లో 21 బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినట్లు అధ్యయనం ద్వారా తేలింది.
ఇవి కూడా చదవండి: