Lava blaze 2: రూ. 10 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌… భారత మార్కెట్లోకి నయా ఫోన్‌.

|

Nov 02, 2023 | 3:16 PM

ఇక మొదట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ ధరలు ఆకాశాన్నంటేలా ఉండేవి. అయితే కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తక్కువ ధరకే 5జీ ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా బ్లేజ్‌2 పేరుతో బడ్జెట్‌ ధరలోనే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను తాజాగా లాంచ్‌ చేసింది...

Lava blaze 2: రూ. 10 వేలకే 5జీ స్మార్ట్‌ ఫోన్‌... భారత మార్కెట్లోకి నయా ఫోన్‌.
Lava Blaze 2 5g
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్‌ విస్తృతి పెరుగుతుండడం, చిన్న చిన్న పట్టణాల్లోనూ 5జీ సేవలను విస్తరిస్తుండడంతో 5జీ టెక్నాలజీకి సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్‌లు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు బ్రాండెండ్‌ కంపెనీలు 5జీ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి.

ఇక మొదట్లో 5జీ స్మార్ట్ ఫోన్‌ ధరలు ఆకాశాన్నంటేలా ఉండేవి. అయితే కంపెనీల మధ్య నెలకొన్ని పోటీ నేపథ్యంలో ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తక్కువ ధరకే 5జీ ఫోన్‌లను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. లావా బ్లేజ్‌2 పేరుతో బడ్జెట్‌ ధరలోనే 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌ను తాజాగా లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇంతకీ ఈ ఫోన్‌ ధర ఎంత.? ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

లావా బ్లేజ్‌2 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో క్లీన్‌ యూఐని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

రెయిర్‌ కెమెరాతో 2కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోను రికార్డ్‌ చేసుకోవచ్చు. కెమరా చుట్టూ రింగ్‌ లైట్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. 18వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో వైఫై5, బ్లూటూత్ 5.0, 3.5 ఎమ్‌ఎమ్‌ జాక్‌ వంటి ఫీచర్లను అందించారు. ఎనిమిది 5జీ బ్యాండ్లకు సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్‌ బరువు 203 గ్రాములగా ఉంది. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఇచ్చారు.

ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 9,999గా నిర్ణయించగా. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 10,999గా ఉంది. ప్రస్తుతం మార్కెట్లోకి లాంచ్‌ అయిన ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకాలు నవంబర్‌ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌తో పాటు రిటైల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..