స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. బ్లాక్ ఫ్రై డే సేల్‌లో బెస్ట్ డీల్స్ ఇవే..

అమెజాన్, ఫ్లిఫ్‌కార్డ్‌లో బ్లాక్ ఫ్రై డే సేల్ నడుస్తోంది. ఈ సేల్‌లో మీరు తక్కువ ధరలకే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ టీవీలపై భారీ బంపర్ సేల్ నడుస్తోంది. క్రెడిట్ కార్టులతో కొనుగోలు చేసే అదనంగా రూ.3 వేలకు తగ్గింపు వస్తోంది.

స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. బ్లాక్ ఫ్రై డే సేల్‌లో బెస్ట్ డీల్స్ ఇవే..
Smart Tv

Updated on: Nov 24, 2025 | 9:37 PM

ప్రస్తుతం ఈ కామర్స్ వెబ్‌సైట్లలో బ్లాక్ ఫ్రై డే సేల్ జోరుగా నడుస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు పలు ఫ్లాట్‌ఫామ్స్‌లలో ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువులైన మొబైల్స్, టీవీలు, ఇయర్ బడ్స్, స్మార్ట్ వాచ్‌లపై భారీ తగ్గింపు ఇస్తున్నాయి. క్రెడిట్ కార్డులపై పలు ఆఫర్లు కూడా అందుబాటులోకి ఉన్నాయి. స్మార్ట్‌టీవీలపై బ్లాక్  ఫ్రై డే సేల్‌లో ఎవరూ ఊహించని ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లు అయిన సోనీ, శాంసంగ్ కంపెనీల ప్రీమియం టీవీలపై అనేక ఆఫర్లు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్లతో పాటు ఈఎంఐ ఆప్షన్లు, నో కాస్ట్ ఈఎంఐ వంటి సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఒకసారి ఆ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

రియల్‌మే టెక్‌లైఫ్ (65-అంగుళాల) QLED అల్ట్రా HD

ఫ్లిఫ్‌కార్ట్ తన బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా కేవలం రూ.38,699కి అందిస్తోంది. దాని ధరతో పోలిస్తే  55 శాతం భారీ తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు. HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్‌తో అదనంగా రూ.1,000 తగ్గింపు వస్తోంది. ఇక దీన్ని ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా కూడా మరింత తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

TCL మెటాలిక్ బెజెల్ లెస్ సిరీస్ 4K

65-అంగుళాల ఈ టీవీ అమెజాన్‌లో 63 శాతం తగ్గింపుతో రూ.45,990కే లభిస్తుంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్‌పై రూ.3 వేల తగ్గింపు ఇస్తోంది.

సోనీ బ్రావియా 2అల్ట్రా HD 4K

ఈ 65-అంగుళాల స్మార్ట్ టీవీని ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయొచ్చు, రూ.66,990కు అందుబాటులో ఉంది. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డుల, క్రెడిట్ కార్డ్ EMIతో రూ.1,500 తగ్గింపు ఆఫర్ వస్తోంది. ఇక HDFC బ్యాంక్ డెబిట్ కార్డు, క్రెడిట్ EMIతో రూ.2 వేలు తగ్గుతున్నాయి.

శామ్సంగ్ క్రిస్టల్ 4K వివిడ్ అల్ట్రా HD

65-అంగుళాల డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ టీవీ ఉంది. Flipkartలో దీనిని చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీని కేవలం రూ.57,990కి అందిస్తోంది. సాధారణ ధరలో చూస్తే 33% తగ్గింపుతో వస్తుంది.