Telugu News Technology Huge discounts on 5G smartphones, check out complete offer details here
5G Smartphones: 5జీ ఫోన్లపై రూ. 20,000 వరకూ తగ్గింపు.. ఒక్కరోజే చాన్స్.. మిస్ చేసుకోవద్దు..
మీరు మంచి 5జీ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఇంతకాలం మీ బడ్జెట్ అడ్జస్ట్ అవ్వక కొనుగోలు చేయలేదా? టాప్ బ్రాండ్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రియల్ మీకి చెందిన 5జీ ఫోన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 20,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. వాటిల్లో తక్షణ తగ్గింపులతో పాటు పలు ఎక్స్ చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కలిపి ఉంటాయి.
మీరు మంచి 5జీ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఇంతకాలం మీ బడ్జెట్ అడ్జస్ట్ అవ్వక కొనుగోలు చేయలేదా? టాప్ బ్రాండ్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రియల్ మీకి చెందిన 5జీ ఫోన్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏకంగా రూ. 20,000 వరకూ తగ్గింపు లభిస్తోంది. వాటిల్లో తక్షణ తగ్గింపులతో పాటు పలు ఎక్స్ చేంజ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు కలిపి ఉంటాయి. 5జీ స్మార్ట్ ఫోన్ మోడల్ ని బట్టి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 11న ప్రారంభమైన ఈ ఆఫర్ సేల్ 17వ తేదీ అర్థరాత్రి వరకూ కొనసాగుతుంది. సమయం లేదు.. ఇప్పుడే ఆఫర్ ల గురించిన పూర్తి వివరాలు తెలుసుకోండి..
ఏంటి ఆఫర్లు..
రియల్ మీ అదిరే ఆఫర్లను అందిస్తోంది. అన్ని మోడళ్ల 5జీ వేరియంట్లపై ఇది అందుబాటులో ఉంది. మీరు రియల్ మీ అధికారిక వెబ్ సైట్లో నుంచే కాక, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్, అమెజాన్ వంటి మెయిల్ లైన్ చానల్స్ లో కూడా ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రియల్ మీ జీటీ2 ప్రో, రియల్ మీ సీ51, రియల్ మీ సీ53, రియల్ మీ సీ55, రియల్ మీ 11ఎక్స్, రియల్ మీ 11 ప్రో, రియల్ మీ 11 ప్రో ప్లస్ వంటి మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఏ మోడల్ పై ఏ ఆఫర్, ఎంత తగ్గింపు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
రియల్ మీ జీటీ2 ప్రో స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై మీకు రూ. 20 వేల తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ 16 సెప్టెంబర్ 2023 నుంచి అందుబాటులో ఉంది. ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను జీరో డౌన్ పేమెంట్, జీరో వడ్డీ రేటుతో కొనుగోలు చేయవచ్చు.
రియల్ మీ నార్జో 60 సిరీస్ స్మార్ట్ ఫోన్ ని రూ. 2000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దాని ప్రో వేరియంట్‌పై కూడా రూ. 2000 వరకూ తగ్గింపు లభిస్తోంది.
రియల్ మీ సీ51 స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ ఆఫర్ కింద రూ. 500 తక్షణ తగ్గింపు లభిస్తోంది. రియల్ మీ సీ53 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ కొనుగోలుపై రూ. 1000 తగ్గింపు అందిస్తోంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరపై రూ. 500 బ్యాంక్ ఆఫర్ లభిస్తోంది.
రియల్ మీ సీ55లో రూ. 1000 కూపన్ అందిస్తోంది. రియల్ మీ 11ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 1000 తగ్గింపు లభిస్తోంది.
రియల్ మీ 11 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ.1500 తగ్గింపు లభిస్తోంది. రియల్ మీ 11 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 2000 తగ్గింపు లభిస్తోంది.
రియల్ మీ 11 ప్రో ప్లస్ 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై రూ. 1000 కూపన్, రూ. 1000 బ్యాంక్ తగ్గింపు, రూ. 1000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుతోంది. ఈ విధంగా మీరు రూ. 3000 వరకు మొత్తం తగ్గింపును పొందగలుగుతారు.