దేశంలో పండగల సందడితో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. దూర ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ తమ సొంత గ్రామాలకు తిరిగి రావడంతో జోష్ నెలకొంది. పండగల సీజన్ లో కొత్త వస్తువును కొనుగోలు చేయడం మన భారతీయుల సంప్రదాయం. దీని వల్ల ఆనందం రెట్టింపు అవ్వడంతో పాటు కలకాలం గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మార్కెట్ లో వివిధ రకాల వస్తువుల కొనుగోలుపై అనే ఆఫర్లు ప్రకటించారు. దీనిలో భాగంగా నథింగ్ కంపెనీ తన ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ అందజేస్తుంది. నథింగ్ ఫోన్ 2 (ఏ), సీఎంఎఫ్ వాచ్ ప్రో, సీఎంఎఫ్ ఫోన్ 1 పై భారీ తగ్గింపు ధరలు ప్రకటించింది. రిటైల్ షోరూమ్ లతో పాటు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి.
కార్ల్ పీ యాజమాన్యంలోని నథింగ్ బ్రాండ్ పై పండగల సీజన్ లో తగ్గింపు ధర ప్రకటించారు. ఈ నేపథ్యంలో నథింగ్ 2 (ఎ) ఫోన్ ను 18,999కి కొనుగోలు చేసుకోవచ్చు. ఎంపిక చేసిన రిటైల్ స్టోర్ లతో పాటు ఫ్లిప్ కార్ట్ లో ఈ ఆఫర్ కొనసాగుతుంది. ఈ ఫోన్ లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ప్రో చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే ఆకట్టుకుంటున్నాయి. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.
బిగ్ బిలియన్ డేస్ లో నథింగ్ ఫోన్ (2ఎ) ప్లస్ ఫోన్ పై కూడా తగ్గింపు ప్రకటించారు. దీన్ని రూ.23,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్ తో పాటు ఎంపిక చేసిన రిటైల్ షాపులలో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే 50 ఎంపీ ప్రధాన కెమెరా, 6.7 అంగుళాల ఎఫ్ హెడ్ డీ ప్లస్ డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7350 చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు.
సీఎంఎఫ్ ఫోన్ 1 కేవలం రూ.12,999కి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కూడా ఫ్లిప్ కార్ట్ తో పాటు ఎంపిక చేసిన ఫోరూమ్ లలో కొనసాగుతుంది. ఈ ఫోన్ లో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 16 జీబీ స్టోరేజీ, మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ తదితర వాటిని ఏర్పాటు చేశారు.
బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అందరికీ ఎంతో ఇష్టమైన స్మార్ట్ వాచ్ కూడా అందుబాటులో ఉంది. సీఎంఎఫ్ వాచ్ ప్రో ను రూ.2,499కు కొనుగోలు చేసుకోవచ్చు. అల్యూమినియం అల్లాయ్ ప్రేమ్, 1.96 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, అంతర్నిర్మిత జీవీఎస్, 110 స్పోర్ట్ మోడ్ లు దీనిలో ఉన్నాయి.
సీఎంఎఫ్ బడ్స్ ప్రో 2ను రూ.3,299కి విక్రయిస్తున్నారు. వీటిలోని డ్యూయల్ డ్రైవర్లు, ఎల్ డీఏసీ టెక్రాలజీ, హై రేస్ ఆడియో వైర్ లెస్ సర్టిఫికేషన్, 50 డీబీ స్మార్ట్ ఏఎస్సీ టెక్నాలజీతో ఆడియో చాలా స్పష్టంగా ఉంటుంది. బ్యాటరీ సుమారు 43 గంటలు పనిచేస్తుంది. అలాగే పది నిమిషాలలోనే చార్జింగ్ చేసుకోవచ్చు.
నెక్ బ్యాండ్ కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఆఫర్ ఉంది. కేవలం రూ.1699కే సీఎంఎఫ్ నెక్ బ్యాండ్ ప్రో అందుబాటులో ఉంది. నీరు, చెమట, దుమ్ము లోపలకు వెళ్లకుండా ఐపీ 55 రేటింగ్ లో వస్తోంది.
పవర్ 100 డబ్ల్యూ చార్జర్ ను రూ.3,499కి విక్రయిస్తున్నారు. సెప్టెంబర్ 26 నుంచి ఈ ఆఫర్ మొదలవుతుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..