Hubble Space Telescope Down: మొరాయిస్తున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్: విఫలమవుతోన్న నాసా ప్రయత్నాలు!

|

Jun 21, 2021 | 11:51 AM

హబుల్ స్పేస్ టెలిస్కోప్ గత కొద్ది రోజులుగా పనిచేయడం లేదని నాసా సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు హబుల్ స్పేస్ టెలిస్కోప్ ను బాగు చేసే పనిలో నిమగ్నమైనట్లు నాసా పేర్కొంది.

Hubble Space Telescope Down: మొరాయిస్తున్న హబుల్ స్పేస్ టెలిస్కోప్: విఫలమవుతోన్న నాసా ప్రయత్నాలు!
Hubble Space Telescope
Follow us on

Hubble Space Telescope Down: హబుల్ స్పేస్ టెలిస్కోప్ గత కొద్ది రోజులుగా పనిచేయడం లేదని నాసా సోషల్ మీడియా వేదికగా శుక్రవారం ప్రకటించింది. ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలం కాగా, మరోసారి హబుల్ స్పేస్ టెలిస్కోప్ ను బాగు చేసే పనిలో నిమగ్నమైనట్లు నాసా పేర్కొంది. 30 ఏళ్లకు పైగా విశ్వంలో చక్కర్లు కొడుతోన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్.. పేలోడ్ కంప్యూటర్‌లో తాత్కాలిక సమస్యలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఈ నెల 13 నుంచి పనిచేయడంలేదని శుక్రవారం నాసా అధికారులు తెలిపారు. అయితే హబుల్ లోని ఇతర పరికరాలు మాత్రం పనిచేస్తున్నాయని, పేలోడ్ కంప్యూటర్ మాత్రమే ఆగిపోయిందని తెలిపింది. అయితే ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని పేర్కొంది. అలాగే బ్యాకప్ మెమరీ మాడ్యూల్‌కు మార్చే ప్రయత్నం కూడా విఫలమైందని తెలిపింది. త్వరలోనే హబుల్‌ను రిపేర్ చేస్తామని వెల్లడించింది.

విశ్వంతరాలను పరిశోధించేందుకు ఈ టెలిస్కోప్‌ ఎంతగానో సహాయపడింది. హబుల్ టెలిస్కోప్‌తో ఇతర గ్రహల, గెలక్సీలపై పరిశోధనలు చేసందుకు శాస్త్రవేత్తలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. 30 ఏళ్లుడా హబుల్‌ టెలిస్కోప్ తన సేవలను అందిస్తోంది. హబుల్‌ టెలిస్కోప్‌ను 1990 ఏప్రిల్‌ 25న ప్రయోగించారు. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్పరాల దూరంలోఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలను నిరంతరాయంగా పనిచేస్తోంది. అయితే గత వారం రోజులుగా సాంకేతిక సమస్యలతో ఇది పనిచేయడం లేదు. అయితే, తాజాగా హబుల్‌ స్ధానంలో మరో కొత్త టెలిస్కోప్‌ను ప్రయోగించాలని నాసా భావిస్తోంది. తరచూ ఈ 30 ఏళ్ల టెలిస్కోప్‌లో సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకుందంట. హబుల్‌ స్థానంలో జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోప్‌ను తీసుకరానున్నట్లు నాసా తెలిపింది. ఈమేరకు ఈ ప్రయోగాన్ని అక్టోబర్‌ 31 న చేపట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హబుల్ కంటే లోతుగా విశ్వాన్ని పరిశోధించనుందని నాసా పేర్కొంది.

Also Read:

Helmet: మెదడును చదివే హెల్మెట్‌ వచ్చేసింది.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ.. ( వీడియో )

Fake Facebook Account : మీ పేరుతో న‌కిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌ ఉందా..? డిలీట్‌ చేయండి ఇలా..!