అద్భుత ఫీచర్లు, భారీ బ్యాటరీతో హువావే ప్యూర్ ఎక్స్ వ్యూ.. మతిపోగొట్టే స్మార్ట్‌ఫోన్‌ వివరాలివే

Huawei Pura X.. హువావే నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. Huawei Pura X View పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది. కంటెంట్ చూడడం, చదవడం, గేమింగ్, ప్రొడక్టివిటీ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది.

అద్భుత ఫీచర్లు, భారీ బ్యాటరీతో హువావే ప్యూర్ ఎక్స్ వ్యూ.. మతిపోగొట్టే స్మార్ట్‌ఫోన్‌ వివరాలివే
Huawei Pura X

Updated on: Aug 24, 2026 | 7:00 AM

సాధారణ స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా వెడల్పైన డిస్‌ప్లే, శక్తివంతమైన బ్యాటరీతో హువావే అద్భుతమైన డివైజ్‌ను పరిచయం చేస్తోంది. ఆగస్టు 28 నుంచి ప్రీ-సేల్స్ ప్రారంభం కానున్న ఈ సరికొత్త ఫోన్ యొక్క పూర్తి ఫీచర్లు, ధర అంచనాల గురించిన వివరాలను తెలుసుకుందాం.

డిస్‌ప్లే విశేషాలు

హువావే (Huawei) నుండి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకరానుంది. Huawei Pura X View పేరుతో రానున్న ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ క్యాండీబార్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది. కంటెంట్ చూడడం, చదవడం, గేమింగ్, ప్రొడక్టివిటీ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫోన్‌ను తయారుచేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో 6.39 అంగుళాల OLED డిస్ప్లే ఉంటుంది. ఇది 2232 × 1320 పిక్సెల్స్ రిజల్యూషన్, 16:9.5 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది.

సాధారణ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే వెడల్పైన స్క్రీన్‌ను అందించడం ఈ ఫోన్ ప్రత్యేకత. స్క్రీన్ బెజెల్స్ కేవలం 1.05 మి.మీ.గా ఉండగా.. స్క్రీన్-టు-బాడీ రేషియో 96.1%గా ఉంది. డిస్ప్లే గరిష్ఠంగా 6,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. వీడియోలు చూడటం, ఈ-బుక్స్ చదవడం, గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనులకు ఈ వైడ్ స్క్రీన్ మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000mAh బ్యాటరీని అందించారు. భారీ బ్యాటరీ కారణంగా ఎక్కువసేపు వీడియోలు చూడటం, గేమింగ్ చేయడం, ఇతర పనులు చేయడం వంటి వాటికి మెరుగైన బ్యాకప్ లభించే అవకాశం ఉంది.

ఫోన్ మందం 6.68 మి.మీ.గా ఉండగా, బరువు 201 గ్రాములుగా ఉంది. ఈ మొబైల్ HarmonyOS 7 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వైడ్ స్క్రీన్‌ను దృష్టిలో పెట్టుకుని వీడియో, రీడింగ్, గేమింగ్, ప్రొడక్టివిటీ వంటి విభిన్న వినియోగ పరిస్థితులకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.

ప్రీ-సేల్స్ తేదీలు

Huawei Pura X Viewను నాలుగు కలర్ ఆప్షన్లలో అందిస్తున్నారు. లీప్ షాడో రెడ్, లినెన్ గ్రే, జీరో డిగ్రీ వైట్, ఫాంటమ్ నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆగస్టు 28 నుంచి స్టోర్లలో అనుభవ కార్యక్రమాలతో పాటు ప్రీ-సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఫోన్ ధర, అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యత వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. లీకైన సమాచారం ప్రకారం ఈ మొబైల్ ప్రారంభ ధర 5,999 యువాన్లు ఉండే అవకాశం ఉంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.72 వేల వరకు ఉంటుంది.

అయితే ఇది అధికారిక ధర కాదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లీక్ ఆధారంగా అంచనా మాత్రమే. ఈ ఫోన్ మూడు RAM, స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వాటి అంచనా ధరలు ఇలా ఉన్నాయి.. 12GB RAM + 256GB స్టోరేజ్: 5,999 యువాన్లు, 12GB RAM + 512GB స్టోరేజ్: 6,499 యువాన్లు, అలాగే 12GB RAM + 1TB స్టోరేజ్: 7,499 యువాన్లుగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ కొత్త కాన్సెప్ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us