
భారతదేశంలో ప్రస్తుతం ల్యాప్‌టాప్‌ల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయం తర్వాత వర్క్ ఫ్రం హోం కల్చర్ విపరీతంగా పెరిగింది. దీంతో ల్యాప్‌టాప్‌ల వాడకం కూడా మెరుగుపడింది. అలాగే విద్యార్థులు కూడా ఆన్‌లైన్ క్లాసుల కోసం ల్యాప్‌టాప్‌లపై ఆధారపడుతున్నారు. గణనీయంగా పెరిగిన ల్యాప్‌టాప్‌ల వినియోగం వల్ల కంపెనీలు కూడా తమ మార్కెట్‌ను పెంచుకోవడానికి ఇష్టపడుతున్నాయి. దీంతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నాయి. ప్రముఖ్య ల్యాప్‌టాప్ తయారీ సంస్థ అయిన హెచ్‌పీ కూడా తాజాగా నాలుగు కొత్త ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు హెచ్‌పీ 14, హెచ్‌పీ 15, హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14, హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్ 360 పేరుతో నాలుగు ల్యాప్‌టాప్స్‌ను అందుబాటులోకి తీసుకవస్తునట్లు ప్రకటించారు. హెచ్‌పీ పెవిలియన్ సిరీస్ తాజా 13వ జెన్ ఇంటెల్ ప్రాసెసర్‌తో అమర్చి ఉంటుంది. అయితే పెవిలియన్ ఎక్స్ 360 ల్యాప్‌టాప్ 360 డిగ్రీల సర్దుబాటు చేయగల కీలు, టచ్ స్క్రీన్, మల్టీ టాస్కింగ్ కోసం బహుళ పోర్ట్‌లను కలిగి ఉంటుంది. గత నెలలో కంపెనీ హెచ్‌పీ పెవిలియన్ ఏరో 13 లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ల్యాప్‌టాప్ ధర, ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
హెచ్‌పీ 14, హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్‌ల ధర రూ. 39,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే హెచ్‌పీ పెవిలియన్ ప్లస్ 14 ప్రారంభ ధర రూ. 81,999గా ఉంది. అయితే హెచ్‌పీ పెవిలియన్ ఎక్స్ 360 ప్రారంభ ధర రూ. 57,999గా ఉంది. ఈ ల్యాప్‌టాప్స్ అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..