
ఐఫోన్ అంటే అందరికీ ఇష్టమే. అప్పులు చేసి మరీ ఐఫోన్ కొంటారు. ఐఫోన్ అయితే సెక్యూరిటీ ఫీచర్స్ బాగుంటాయని అందరు దానిపై ఆసక్తి చూపుతారు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడి కొత్త ఐఫోన్ కొన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్‌కు డేటా ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలనేది పెద్ద సమస్యగా మారుతుంది. ఫోటోలు, కాంటాక్ట్‌లు, మెసేజ్‌లు, యాప్‌లు, వాట్సాప్ చాట్‌లను ఎలా బదిలీ చేయాలో చాలా మందికి తెలియదు. కానీ పాత ఫోన్ నుండి కొత్త ఐఫోన్‌కు డేటాను బదిలీ చేయడం కష్టమైన పని కాదు.. ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్‌కు డేటాను క్షణాల్లో బదిలీ చేయడానికి సులభమైన మార్గం ఏమిటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఆండ్రాయిడ్ నుండి ఐఫోన్‌కు డేటాను బదిలీ చేయడాన్ని చాలా సులభతరం చేసే యాప్‌ను ఆపిల్ స్వయంగా అభివృద్ధి చేసింది. ఈ యాప్ పేరు మూవ్ టు iOS. ఇది గూగుల్ ప్లే స్టోర్‌లో ఫ్రీగా లభిస్తుంది. ఈ యాప్‌తో మీరు కాంటాక్ట్‌లు, క్యాలెండర్, ఫోటోలు, వీడియోలు, మెయిల్, సందేశాలు, వెబ్ బుక్‌మార్క్‌లు, వాట్సాప్ చాట్‌లను సులభంగా షేర్ చేయవచ్చు.
ఇప్పుడు మీరు ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్‌కు వాట్సాప్ యొక్క మొత్తం చాట్ బ్యాకప్‌ను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీని కోసం ఆండ్రాయిడ్ ఫోన్‌లోని వాట్సాప్ సెట్టింగ్‌లకు వెళ్లి.. చాట్స్ విభాగంపై క్లిక్ చేసి, మూవ్ చాట్స్ టూ iOSపై నొక్కండి. దీని తర్వాత డేటాను సెలక్ట్ చేసుకోవాలి. ఐఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, అదే నంబర్‌ను నమోదు చేస్తే పాత డేటా వస్తుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..