Gmail Schedule Email: మెయిల్స్ ఉపయోగం ఇటీవల బాగా పెరిగిపోయింది. జాబ్ అప్లికేషన్స్ నుంచి ఫైల్స్ షేరింగ్ వరకు మెయిల్స్ ద్వారానే పనికానిచ్చేస్తున్నారు. ఇక మెయిల్ సర్వీస్‌లలో జీమెయిల్ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మెయిల్స్ సేవలను అనేక సంస్థలు అందిస్తోన్న ఎక్కువ మంది మాత్రం జీమెయిల్‌నే ఉపయోగిస్తున్నారు. మరి జీమెయిల్‌లో రకరకరాల ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా.?
ఉదాహరణకు మీరు కచ్చితంగా పంపించాల్సిన మెయిల్ ఒకటి ఉంటుంది. దానిని ఫలానా సమయానికే సెండ్ చేయాల్సిన అవసరం. తీరా సమయానికి మర్చిపోతే ఎలా చెప్పండి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే జీమెయిల్‌లో షెడ్యూల్డ్ ఈమెయిల్ ఫీచర్‌ను అందబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో మీరు కోరుకున్న సమయానికి మెయిల్ పంపించుకోవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలంటే.
* ముందుగా జీమెయిల్ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి.
* అనంతరం మెయిల్‌ను కంపోస్ చేసి సెండ్ ఆప్షన్ పక్కనే ఉన్న డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ సిబల్‌పై క్లిక్ చేయాలి.
* తర్వాత కనిపించే షెడ్యూల్డ్ సెండ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన సమయం ఎంచుకోవడానికి పిక్ అండ్ డేట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* మీ మెయిల్ షెడ్యూల్ అయిందని జీమెయిల్ డ్రాఫ్ట్‌లో సేవ్ అవుతుంది.
* ముందుగా మొబైల్‌లోని జీమెయిల్ యాప్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* అనంతరం కంపోజ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మెయిల్ టైప్ చేసిన తర్వాత పక్కనే ఉన్న మూడు చక్కలపై క్లిక్ చేయాలి.
* అనంతరం షెడ్యూల్ టై అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన సమయాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది.
Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. రాఖీ పౌర్ణమి వేళ తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గిదంటే..
Weight Lose: బరువు తగ్గడం అంత ఈజీ కాదని అందరికి తెలుసు..! కానీ ఈ 5 విషయాలు తెలుసుకుంటే మంచిది..