WhatsApp: వాట్సప్‌ వాడుతున్నారా..? వీడియో కాల్ షెడ్యూల్ చేసుకోండి.. ఎలా అంటే..?

ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ అందరూ కలిసి వీడియో కాల్ మాట్లాడుకోవాలనుకుంటే ఇంతకముందు వేరే వేరే యాప్స్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు వాట్సప్‌లోనే అన్నీ ఫీచర్లు అందబాటులోకి వచ్చాయి. ఇటీవల వీడియో కాల్ షెడ్యూల్ ఆప్షన్ కూాడా వాట్సప్‌లో అందుబాాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.

WhatsApp: వాట్సప్‌ వాడుతున్నారా..? వీడియో కాల్ షెడ్యూల్ చేసుకోండి.. ఎలా అంటే..?
Whats App

Updated on: Nov 21, 2025 | 5:22 PM

వాట్సప్ ఎప్పటికప్పుడు యూజర్లకు కొత్త అనుభూతిని అందించేందుకు అనేక అడ్వాన్స్ ఫీచర్లు తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇటీవల వీడియో కాలింగ్ షెడ్యూల్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. జూమ్, గూగుల్ మీట్ వంటి ఫ్లాట్‌ఫామ్‌లలో ఎలా అయితే ఏదైనా మీటింగ్ షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవచ్చో.. వాట్సప్‌లో కూడా అలానే చేసుకోవచ్చు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆఫీస్ ఉద్యోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీటింగ్ ముందుగానే షెడ్యూల్ చేయడం వల్ల ఆ టైమ్‌కి అందరూ అందుబాటులో ఉండే అవకాశముంటుంది. అయితే  ఈ ఫీచర్ ఉపయోగించుకుని వాట్సప్ కాల్స్ షెడ్యూల్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం.

కాల్ షెడ్యూల్ ఇలా..

-వాట్సప్ ఓపెన్ చేశాక కింద కనిపించే కాల్స్ ట్యాబ్‌లోకి వెళ్లాలి

-అక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి

-ఆ తర్వాత డేట్, టేమ్, కాల్ టైప్(వాయిస్, వీడియో), కాల్ నేమ్, డస్క్రిప్షన్ అనేది సెలక్ట్ చేసుకోవాలి

-అనంతరం నెంబర్స్ సెలక్ట్ చేసుకుని ప్రోసీడ్ అవ్వాలి

-అక్కడ వచ్చే లింక్‌ను కాపీ చేసుకుని షేర్ చేయవచ్చు

-కాల్ స్టార్ట్ అవ్వకముందు పార్టిసిపెంట్స్‌కు నోటిఫికేషన్ వెళ్తుంది.

ఎమోజీలు

ఇక కాల్ షెడ్యూలింగ్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. కాల్ జరుగుతున్న సమయంలో మీరు మాట్లాడుకోవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేసే ఎమోజీ ఉంది. అలాగే రియాక్షన్స్ ఇచ్చేందుకు ఎమోజీలు కూడా చాలా ఉన్నాయి. మనం కాల్ లింక్ క్లియేట్ చేస్తే.. దాని ద్వారా ఎవరైనా పార్టిసిమెంట్ జాయిన్ అయితే వాట్సప్ నోటిఫికేషన్ కూడా పంపుతుంది. దీని వల్ల మీటింగ్‌లో ఎవరెవరు అటెండ్ అయ్యారనేది తెలుస్తుంది.

అన్నీ ఒకేచోట

అంతేకాకుండా మీకు కాల్ ట్యాబ్‌లో అన్నీ ఒకేచోట ఉంటాయి. షెడ్యూల్ చేసిన కాల్స్‌తో పాటు వ్యక్తిగత కాల్స్ అన్నీ ఒకేచోట లభిస్తాయి. దీంతో మీరు ఎవరెవరికి కాల్ చేశారు.. ఎవరెవరు మీకు కాల్ చేశారు అనే విషయాలు ఒకేచోట ఉంటాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి