Tech Tips: కొత్త డయల్‌ స్క్రీన్‌తో చిరాకుపడుతున్నారా?.. ఇలా ఈజీగా పాత వర్షన్‌లోకి మార్చుకోండి!

ఇటీవలే గూగుల్‌ ఫోన్‌ యాప్‌లో కొత్త అబ్‌డేట్‌ తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ అప్‌డేత్‌తో మన డయల్‌ స్క్రీన్‌ డిజైన్‌ మొత్తం మారిపోయింది. కొందరికి ఈ డిజైన్ నచ్చినా మరికొందరు ఈ అప్‌డేత్‌తో చిరాకుపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే మన మొబైల్‌లోని ఒక సింపుల్ ట్రిక్‌తో మనం మళ్లీ మన పాత డయలర్ స్కీన్‌ను పొందవచ్చు.. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

Tech Tips: కొత్త డయల్‌ స్క్రీన్‌తో చిరాకుపడుతున్నారా?.. ఇలా ఈజీగా పాత వర్షన్‌లోకి మార్చుకోండి!
How To Remove New Update

Updated on: Aug 24, 2025 | 5:22 PM

గూగుల్ ఇటీవల తన గూగుల్ ఫోన్ యాప్‌లో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఈ అప్‌డేట్ తర్వాత, మిలియన్ల మంది ఆండ్రాయిడ్ వినియోగదారుల ఫోన్‌లలో కాల్ స్క్రీన్ డిజైన్ మారిపోయింది. చాలా మంది వినియోగదారులు ఈ కొత్త ఇంటర్‌ఫేస్‌ నచ్చినప్పటికీ.. కొంతమంది వినియోగదారులు మాత్రం దీనితో చిరాకుపడుతున్నట్టు తెలుస్తోంది. పాడ డైలర్‌ ఇంటర్‌పేస్‌ను ఇష్టపడే చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో దీని గురించి ఫిర్యాదు చేస్తున్నారు. అయితే మీరు కూడా ఈ అప్‌డేట్‌ ఫీచర్‌ వద్దనుకొని.. మళ్లీ పాత ఇంటర్‌పేస్‌ పొందాలనుకుంటే.. మీ ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్‌ చేంజ్ చేసుకోండి. దీని ద్వారా మీరు ఈజీగా మీ పాత డయల్‌ స్క్రీన్‌ను పొందవచ్చు.

పాత కాల్ స్క్రీన్‌ను ఎలా పొందాలి?

మీ ఫోన్‌లో కొత్తగా అప్‌డేట్‌ అయిన కాల్ స్క్రీన్ డిజైన్ మీకు నచ్చకపోతే, మీ ఫోన్‌లో ఒక్క సెట్టింగ్‌ను ఛేంజ్ చేయడం ద్వారా మీరు పాత ఇంటర్‌ఫేస్‌ను సులభంగా తిరిగి పొందవచ్చు. దీని కోసం పెద్ద ప్రాసెస్‌ కూడా ఏం ఉండదు.

  • ఫస్ట్‌ మీ ఫోన్‌లోని ఫోన్ డయలర్ యాప్‌పై లాంగ్‌ ప్రెస్‌ చేయండి..
  • తర్వాత యాప్‌ ఇన్‌ఫో అని వస్తుంది దానిపై క్లిక్ చేయండి.
  • తర్వాత స్క్రీన్‌పైన రైట్‌ సైడ్‌లో 3డాట్స్‌ కనిపిస్తాయి.. వాటిపై క్లిక్ చేయండి
  • ఇక్కడ మీకు అప్‌డేట్‌ అన్‌ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
  • ఇలా చేసిన తర్వాత, మీ ఫోన్ Google Phone యాప్ ఫ్యాక్టరీ వెర్షన్‌కు సెట్ చేయబడుతుంది.
  • ఆ తర్వాత మీ పాత కాల్ స్క్రీన్ మళ్లీ మీకు తిరిగి వస్తుంది.

అప్‌డేట్‌ చేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి

మీరు మీ పాత డైలర్‌ ఇంటర్‌పేస్‌ పొందాలనుకునే ఈ ప్రక్రియ చేసేటప్పుడు మీ కాల్ హిస్టరీని లేదా కొన్ని కస్టమ్ సెట్టింగ్‌లను తొలగించే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి, ముందుగా జాగ్రత్తగా, మీరు ఏవైనా ముఖ్యమైన నెంబర్, ఫోటోస్‌ వంటికి ఉంటే వాటిని బ్యాకప్ తీసుకోవడం మంచింది. ఈ కొత్త లుక్‌ను మళ్లీ అప్‌డేట్ చేయకుండా ఉండటానికి, Google Play Storeకి వెళ్లి ఆటో-అప్‌డేట్‌ను నిలిపివేయండి. మీరు ఏదైనా కొత్తగా అప్‌డేట్ చేయాలనుకున్నప్పుడు, Google Play Storeకి వెళ్లి ఎప్పటికప్పుడు దాన్ని చేస్తూ ఉండండి.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.