Google Image: గూగుల్‌లో నకిలీ ఫోటోలను గుర్తించడం ఎలా..? చిన్న ట్రిక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు..!

Google Image: మనం ఇంటర్నెట్‌లో అనేక రకాలైన ఫోటోలను చూస్తూనే ఉన్నాము. అయితే ఇది నిజమా .. ? కాదా అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని..

Google Image: గూగుల్‌లో నకిలీ ఫోటోలను గుర్తించడం ఎలా..? చిన్న ట్రిక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు..!
Google

Updated on: Apr 27, 2021 | 2:39 PM

Google Image: మనం ఇంటర్నెట్‌లో అనేక రకాలైన ఫోటోలను చూస్తూనే ఉన్నాము. అయితే ఇది నిజమా .. ? కాదా అనేది మాత్రం తెలియదు. ఎందుకంటే అచ్చం అలాంటి ఫోటోలని గ్రాఫిక్స్‌ తో మార్చివేసి వేరే విధంగా చూపిస్తారు. ఇలాంటివి ఎక్కువగా రాజకీయ నాయకులు, సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఒక ఫోటో నిజమైనదా..? కాదా? అనేది తెలుసుకోవాలంటే చిన్న ట్రిక్స్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

గూగుల్‌ ఇమేజెస్‌

ఆన్‌లైన్‌లో ఎక్కువగా ఫోటోలను సెర్చ్‌ చేయడానికి ప్రధానంగా ఉపయోగించేది గూగుల్‌. గూగుల్‌లో మనకు కనిపించే ఫోటోలు నిజమా..? కదా అనేది గూగుల్‌ ఇమేజెస్‌ మనకు రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ ఆప్షన్‌ను అందిస్తుంది. మనం ఏదైనా ఇమేజ్‌ వెతికినప్పుడు ఆ ఇమేజ్‌ విషయంలో మీకు ఏదైనా అనుమానం ఉంటే గూగుల్‌ ఇమేజెస్‌కు వెళ్లి కెమెరా ఐకాన్‌ మీద క్లిక్‌ చేయాలి. మీరు చూసిన ఫోటో యూఆర్‌ఎల్‌ లేదా ఆ ఫోటోను నేరుగా అప్లోడ్‌ చేయాలి. అప్పుడు వెంటనే గూగుల్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందో.. దాని మూలం ఎక్కడిదో మనకు తెలియజేస్తుంది.

గూగుల్‌ సెర్చ్‌

మీ ఆండ్రాయిడ్‌ పరికరంలో గూగుల్‌ రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడానికి మీరు రివర్స్‌ సెర్చ్‌ చేయాలనకుంటున్న ఫోటోలను ఎంపిక ఏచసి దానిమీద రైట్‌ క్లిక్‌ చేసి ఇవ్వండి. అప్పుడు మీరు సెర్చ్‌ గూగుల్‌ ఫర్‌ ఇమేజ్‌ క్లిక్‌ చేస్తే గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది అనేది చూపిస్తుంది.

ఇవీ చదవండి:

iPhone 13 series: త్వరలో యాపిల్ నుంచి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు.. అదిరిపోయే ఫీచర్స్‌..!

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. 18 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌.. మైలేజీ ఎంతంటే..?

Loading...
Unable to load recommendations.
Follow Us