Tech Tips: 30 సెకండ్లలో మీ మడతలు పడ్డ చార్జింగ్ కేబుల్స్‌ని కొత్తగా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?

| Edited By: Subhash Goud

Dec 13, 2024 | 2:02 PM

Tech Tips: అదే వేడి నీటిలో కొంచెం వెనిగర్ వేసి నానబెట్టండి. 30 సెకండ్ల తర్వాత కాటన్ క్లాత్ తో తుడిస్తే మరకలు మాయమైపోతాయి. లేదా శానిటైజర్ ఉంటే ఆ జిడ్డు మరకలు..

Tech Tips: 30 సెకండ్లలో మీ మడతలు పడ్డ చార్జింగ్ కేబుల్స్‌ని కొత్తగా చేయొచ్చు.. ఎలాగో తెలుసా?
Follow us on

ఈరోజుల్లో ప్రతి వ్యక్తికి మినిమం రెండు చార్జింగ్ కేబుల్స్ ఉంటున్నాయి. ఒకటి ఇంట్లో చార్జింగ్ పెట్టుకునేందుకు మరొకటి ట్రావెలింగ్ కోసం. అయితే ఈ చార్జింగ్ కేబుల్స్ కొద్ది రోజులు వాడగానే బాగా మడతలు పడి, మరకలు పడి పాతబడిపోతాయి. ఈ మడతలు పడ్డ ఛార్జింగ్ కేబుల్ ను అలాగే వదిలేస్తే కొద్దిరోజులకి తెగిపోతుంది. అలా కాకుండా 30 సెకండ్లలో మీ చార్జింగ్ కేబుల్స్ ని కొత్త వాటిలా తయారు చేయొచ్చు. ఎన్ని మరకలు ఉన్న వదిలిపోయి మిల మిల మెరుస్తాయి.

సింపుల్ టెక్నిక్:

ఒక గ్లాస్ బౌల్ లో వేడి నీళ్లు తీసుకోండి. మరీ వేడిగా కాకుండా ఒక 40 డిగ్రీల వరకు పరవాలేదు. ఆ తర్వాత మీ మడతలు పడ్డ, చిక్కులు పడ్డ చార్జింగ్ కేబుల్స్ ని రెండు చివర్ల చేతిలో పట్టుకొని ఆ వేడి నీళ్లలో ముంచండి. ఆందోళన అవసరం లేదు చార్జింగ్ కేబుల్స్ కి ఎలాంటి ప్రమాదం జరగదు. రెండు చివర్లు చేతిలో పట్టుకుంటారు కాబట్టి వాటికి నీరు తగిలే అవకాశం ఉండదు. అలా 30 సెకండ్లు వేడి నీళ్లలో ఉంచి బయటకు తీసి సింపుల్ గా ఒక కాటన్ క్లాత్ తో ఒక చివరన పట్టుకొని కిందకి తుడవండి.
అంతే మీరు కొన్న కొత్తలో ఎలా ఉండేవో కేబుల్స్ అంతే స్ట్రైట్ గా ఉంటాయి.

 బాగా మరకలు పడి జిడ్డు జిడ్డుగా కనిపిస్తున్న కేబుల్స్ అయితే..

అదే వేడి నీటిలో కొంచెం వెనిగర్ వేసి నానబెట్టండి. 30 సెకండ్ల తర్వాత కాటన్ క్లాత్ తో తుడిస్తే మరకలు మాయమైపోతాయి. లేదా శానిటైజర్ ఉంటే ఆ జిడ్డు మరకలు ఉన్న కేబుల్ స్పై చేసి సాఫ్ట్ క్లాత్ తో క్లీన్ చేయండి. ఇలా చార్జింగ్ కేబుల్స్ ని అప్పుడప్పుడు చేయడం ద్వారా వాటి లైఫ్ టైం చాలా రోజులు ఉంటుంది. కొన్ని రకాల చార్జింగ్ కేబుల్స్ అంత ఈజీగా మార్కెట్లో దొరకవు. ఇప్పుడు అన్ని దాదాపుగా సి టైప్ కేబుల్స్ వస్తున్నాయి కాబట్టి మిగతా కేబుల్స్ మార్కెట్లో కనిపించడం లేదు. అలాంటి గాడ్జెట్స్ వాడుతున్న వాళ్లు ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా ఆ కేబుల్స్ ని కొన్ని ఏళ్లపాటు వినియోగించవచ్చు.

ఇది చదవండి: Airtel Cheapest Plan: ఎయిర్‌టెల్‌ సూపర్‌ ప్లాన్‌.. కేవలం రూ.1999 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి