
Gmail Storage: ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు.. ఇలా ఎవరికైనా జీమెయిల్ అనేది అవసరమే. ఫొటోలు, వీడియోలు, ఫైల్స్.. ఇలా ఏవి పంచుకోవాలన్నా లేదా భద్రపర్చుకోవాలన్నా జీమెయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఉద్యోగాలు చేసేవారికి వర్క్ పరంగా జీమెయిల్ వినియోగించాల్సి ఉంటుంది. జీమెయిల్ స్టోరేజ్ ఫుల్ అయి కొత్త మెయిల్స్ అందుకోలేని పరిస్థితి అందరూ ఎదుర్కొనే ఉంటారు. ఇలాంటి సమయంలో ఎలా క్లియర్ చేసుకోవాలనే విషయంలో చాలామంది గందరగోళ పడుతూ ఉంటారు. ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక చిరాకు పడుతుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మీరు కొన్ని నిమిషాల్లోనే స్టోరేజ్ క్లీనప్ చేసుకోవచ్చు. ఎలా అంటే..
-జీమెయిల్ ఓపెన్ చేయండి
-మెయిల్స్ అన్నీ ఎంచుకోవడావనికి చెక్ బాక్స్‌పై క్లిక్ చేయండి
-అక్కడ ఏయే మెయిల్స్ డిలీట్ చేయాలనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని ఎంచుకోండి
-బిన్ ఐకాన్‌పై క్లిక్ చేసి మెయిల్ తొలగించండి
-జీమెయిల్ ఓపెన్ చేయండి
-సోషల్ మీడియా లేదా ప్రమోషన్స్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-సెలక్ట్ ఆల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి డిలీట్ బటన్‌పై ప్లస్ చేయండి
మీరు డిలీట్ చేసిన మెయిల్స్ 30 రోజుల పాటు బిన్ ఫోల్డర్‌లో ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఆ ఫోల్డర్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన మెయిల్స్‌ని ఎంచుకోండి. ఆ తర్వాత రీస్టోర్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మెయిల్స్ తిరిగి పొందుతారు.
మీకు అవసరం లేని మెయిల్స్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉంటారు. కనీసం నెలకు ఒకసారైనా మెయిల్ ఓపెన్ చేసి అనవసర మెయిల్స్ తొలగిస్తూ ఉండాలి. దీని వల్ల మీకు స్టోరేజ్ సమస్య ఉండదు. మీరు సులువుగా జీమెయిల్ ఉపయోగించుకోవచ్చు. స్టోరేజ్ పూర్తి అవ్వగానే చాలామంది ఎక్స్ ట్రా డబ్బులు పే చేసి పెంచుకుంటారు. అలా చేయకుండానే అవసరం లేని ఫైల్స్‌ను డిలీట్ చేయడం వల్ల డబ్బులు ఆదా చేసుకోవచ్చు.