BSNL 4G: ఎవరి సహాయం లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

|

Mar 17, 2025 | 5:53 PM

అనేక ప్రాంతాలలో BSNL 4G సేవ ప్రారంభమైంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌ క్రమంగా పెరుగుతోంది. దీంతో 4G సిమ్ కార్డులు అందజేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఖరీదైన ప్లాన్ల కారణంగా ప్రజలు నిరంతరం బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా ప్రాంతాలలో 4G సిమ్‌ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి..

BSNL 4G: ఎవరి సహాయం లేకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివేట్‌ చేసుకోవచ్చు.. ఎలాగంటే..
Follow us on

గత కొన్ని నెలలుగా ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు భారీగా పెంచేశాయి. ఆ తర్వాత ప్రజలు BSNL వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఒకటి లేదా రెండు నెలల్లో లక్షలాది మంది వినియోగదారులు తమ నంబర్లను బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ చేసుకున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్లు చౌకగా ఉంటాయి. కానీ మొబైల్ నెట్‌వర్క్‌తో చాలా సమస్యలు ఉన్నాయి. జూలై 2024లో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా మూడు కంపెనీలు తమ పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరను గణనీయంగా పెంచాయి. దీని కారణంగా భారతదేశంలోని లక్షలాది మంది టెలికాం వినియోగదారులు ప్రభావితమయ్యారు.

అనేక ప్రాంతాలలో BSNL 4G సేవ ప్రారంభమైంది. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G నెట్‌వర్క్‌ క్రమంగా పెరుగుతోంది. దీంతో 4G సిమ్ కార్డులు అందజేస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఖరీదైన ప్లాన్ల కారణంగా ప్రజలు నిరంతరం బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా ప్రాంతాలలో 4G సిమ్‌ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సిమ్‌ను యాక్టివేట్ చేయడానికి సరైన మార్గం ఏమిటి? బీఎస్ఎన్ఎల్ 4 జి సిమ్ ను హోమ్ డెలివరీ కూడా చేస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ను మీరే యాక్టివ్‌ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.

1. ముందుగా మీ సిమ్ కార్డును ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయండి.

2. దీని తర్వాత నెట్‌వర్క్ వచ్చే వరకు వేచి ఉండండి.

3. నెట్‌వర్క్ సిగ్నల్ కనిపించిన వెంటనే 1507 కు కాల్ చేయండి.

4. దీని తరువాత కన్ఫర్మేషన్‌ కోసం చిరునామా, పేరు వంటి సమాచారాన్ని అందించండి.

5. మీ ధృవీకరణ పూర్తయిన తర్వాత నంబర్ యాక్టివేట్ అవుతుంది.

6. దీని తర్వాత మీరు కాలింగ్, ఇంటర్నెట్ కోసం సిమ్‌ని ఉపయోగించుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి