Honor 200 Lite: ఈ ఫోన్ కింద పడినా ఏం కాదు.. లైట్ వెయిట్ డిజైన్.. లాంచింగ్ ఎప్పుడంటే..

|

Sep 12, 2024 | 3:01 PM

కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ 200 లైట్ గ్లోబల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అంతా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఈ కొత్త ఫోన్ చిత్రాన్ని సైతం విడుదల చేసింది. తెలుగు రంగుతో మధ్యలో పక్షి ఈక ను ఉంచింది. అంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందని హింట్ ఇచ్చింది.

Honor 200 Lite: ఈ ఫోన్ కింద పడినా ఏం కాదు.. లైట్ వెయిట్ డిజైన్.. లాంచింగ్ ఎప్పుడంటే..
Honor 200 Lite Teaser Image
Follow us on

దేశంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటైన హానర్ నుంచి మరో ఫోన్ త్వరలో మార్కెట్లోకి రానుంది. ఈ బ్రాండ్ ఫోన్లు తక్కువ ధరలో అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లను వినియోగదారులకు అందిస్తాయి. అందుకే ఈ కంపెనీ నుంచి ఏ కొత్త ఫోన్ వస్తున్నా.. వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ క్రమంలో కంపెనీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ హానర్ 200 లైట్ గ్లోబల్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు అంతా సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన టీజర్ ను సైతం కంపెనీ ఆవిష్కరించింది. ఈ చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఈ కొత్త ఫోన్ చిత్రాన్ని సైతం విడుదల చేసింది. తెలుగు రంగుతో మధ్యలో పక్షి ఈక ను ఉంచింది. అంటే ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందని హింట్ ఇచ్చింది. ఈ కొత్త హానర్ 200 లైట్ ఇటీవల కంపెనీ నుంచి వచ్చిన హానర్ 200 సిరీస్.. హానర్ 200 5జీ, హానర్ 200 ప్రోనకు కొనసాగింపుగా ఉంటుంది. ఇది ఈ నెలాకరుకు గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలో టీజర్..

హానర్ కంపెనీ సోషల్ మీడియాలో టీజర్ ను లాంచ్ చేసింది. ఎక్స్(ట్విట్టర్) వేదికగా దీనిని విడుదల చేసింది. ‘మీ రోజువారీ జీవితాన్ని మరింతగా ఎలివేట్ చేయడానికి సిద్ధమవ్వండి.. అత్యంత శక్తివంతమైన ‘లైట్’ మీ ముందుకు రాబోతోంది. వేచి ఉండండి!’ అంటూ కొటేషన్ జోడించింది.

హానర్ లైట్ స్పెసిఫికేషన్స్..

మార్కెట్ వర్గాల వద్ద అందుబాటులో సమాచారం ప్రకారం ఈ ఫోన్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. డ్రాప్ రెసిస్టెంట్ డిజైన్ ను కలిగి ఉంటుంది. కింద పడినా పెద్ద ఫోన్ డ్యామేజ్ కాదు. రిస్క్ ఫ్రీ డిమ్మింగ్ తో కూడిన అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది. 6.7 అంగుళాల స్క్రీన్ ను కలిగి ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080, ఆక్టా కోర్ ప్రాసెసర్లతో పనిచేస్తుంది. మ్యాజిక్ ఓఎస్, ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసస్తుంది. రెండు వేరియంట్లలో వస్తుందని చెబుతున్నారు. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్, 12జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఉంటుంది. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 5ఎంపీ వైడ్ అండ్ డెప్త్, 2ఎంపీ మాక్రో కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 50ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ సామర్థ్యం 4500ఎంఏహెచ్ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..