Digital Voter ID Card: మీ డిజిటల్‌ ఓటర్‌ ఐడి కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!

|

Feb 10, 2022 | 9:07 AM

Digital Voter ID Card: ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఓటర్‌ ఐడి తప్పనిసరి. భారత ఎన్నికల సంఘం ఓటర్‌ ఐడి లేనివారికి ఓటర్‌ ఐడి కార్డుకు దరఖాస్తు...

Digital Voter ID Card: మీ డిజిటల్‌ ఓటర్‌ ఐడి కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవాలా..? ఇలా చేయండి..!
Follow us on

Digital Voter ID Card: ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఓటర్‌ ఐడి తప్పనిసరి. భారత ఎన్నికల సంఘం ఓటర్‌ ఐడి లేనివారికి ఓటర్‌ ఐడి కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తుంటుంది. దేశంలో ఓటు వేసేందుకు అర్హత కలిగిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు చేపడుతుంటుంది. ఇక ఓటర్లు డిజిటల్‌ ఓటర్‌ ఐడి కార్డును పొందవచ్చు. ఒక వేళ ఓటర్‌ ఐడి కార్డు పోగొట్టుకున్నా… దానిని పొందేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. ఎన్ని పద్దతులు పాటించడం వల్ల ఓటర్లు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేకాదు కార్డులో ఏవైనా తప్పులున్నా.. సరి చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా..?

► ముందుగా డిజిటల్‌ ఓటర్ ఐడీ కార్డును డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://voterportal.eci.gov.in లేదా https://nvsp.in/ లోకి వెళ్లాలి.

► అక్కడ ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌లో మీ అకౌంట్‌లోకి లాగిన్ లేదా రిజిస్టర్ కావాల్సి ఉంటుంది.

► ఒకవేళ అకౌంట్ లేకపోతే.. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్టర్ చేసుకుని పాస్‌వర్డ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి.

► అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత… అందులో అడిగే మీ వివరాలను నమోదు చేయాలి. తర్వాత లాగిన్ ఐడీ క్రియేట్ అవుతుంది.

► లాగిన్ అయిన తర్వాత.. ఈపీఐసీ నెంబర్‌ను లేదా ఫామ్ రిఫరెన్స్ నెంబర్‌ను నమోదు చేసి, రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.

► ఆ తర్వాత మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓ ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేయాలి.

► తర్వాత ఈ-ఈపీఐసీని డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది.

► ఓటర్ ఐడీ పీడీఎఫ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఇవి కూడా చదవండి:

Tesla Rrecalls: వాహనదారుల మెడకు చుట్టుకుంటున్న టెక్నికల్‌ ఎర్రర్‌.. వేలాది వాహనాలు వెనక్కి

Google Account: గూగుల్‌ అకౌంట్లో మీ వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ఉండాలా..? ఇలా చేయండి