కారులో ఎయిర్ బ్యాగ్స్ గురించి అందరూ వినే ఉంటూరు. చాలా మంది తరచూ చూస్తూనే ఉంటారు. కారు ప్రయాణిస్తున్నప్పుడు అనుకోని విధంగా కారు క్రాష్ అయితే అవి అత్యవసరంగా తెరచుకొని కారులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలు కాపాడేందుకు దోహదపడతాయి. ప్రతి కారులో ఇవి ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఇదే రకమైన భద్రతను ఫోన్లకు ఉంది. ఫోన్ కి కూడా ఎయిర్ బ్యాగ్ తగిలించవచ్చా? అది ఎలా సాధ్యం? తెలుసుకుందాం రండి..
మీరు ఒకవేళ ఏదైనా ఫోన్ కొనుగోలు చేస్తే దాని రక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అందుకోసం స్క్రీన్ పై ట్యాంపర్డ్ గ్లాస్, ఫోన్ బాడీ ప్రొటెక్షన్ కోసం ఫోన్ కేసు వంటివి తీసుకుంటారు. ఫోన్ అనుకోని విధంగా కింద పడిపోయినప్పుడు ఇవి ఫోన్ ను సంరక్షిస్తాయి. అయినప్పటికీ కొన్నికొన్ని సందర్భాల్లో ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్న ఫోన్ కిందపడిపోయి పగిలిపోతుంటుంది. అందుకే ఫోన్ ను భద్రపరిచే ఫోన్ కేస్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది. ఇది బాగా వైరల్ అయిపోయింది. అంటే మీ బ్యాక్ కవర్ లోనే ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఎప్పుడైనా అనుకోని విధంగా ఫోన్ కింద పడిపోతే వెంటనే ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి ఫోన్ ని సంరక్షిస్తుంది.
ఈ ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ వినియోగిస్తూ ఓ యువకుకు తన ఇన్ స్టాగ్రామ్ పేజీపై ఓ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో తన ఫోన్ ని ఎయిర్ బ్యాగ్ ఏవిధంగా సంరక్షించిందో చూపించాడు. ఆ ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ ను ఆర్డర్ చేసి దానిని పరీక్షించాడు. ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన క్లిప్ లో కొంత ఎత్తు నుంచి తన ఫోన్ వదిలేయడం కనిపించింది. ఫోన్ నెలను తాకే చివరి సెకన్లో ఎయిర్ బ్యాగ్ కవర్ నుంచి ఓపెన్ అయ్యి ఫోన్ ని సంరక్షించింది. బావుంది కదా! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ట్రై చేసేయండి. ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ ఆన్ లైన్ లో వెతికితే ఇట్టే దొరుకుతుంది. వెంటనే ఆర్డర్ చేసేయండి.
ఈ వీడియో ఆగస్టు 21న వెక్టర్ అనే ఇన్ స్టాగ్రామ్ హ్యాండ్లర్ తన పేజీపై పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇది 55 మిలియన్ల వ్యూస్ సాధించింది. ప్రతి రోజూ ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఎయిర్ బ్యాగ్ ఫోన్ కేస్ చూసిన వినియోగదారులు తామూ దీనిని కొనుగోలు చేస్తామని, ఇది అద్భుతమని, ఇది నాకూ కావాలని, నేనూ ఆర్డర్ చేశా అని వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..