ఇంట్లో ప్రతి వస్తువూ కూడా స్మార్ట్ అయిపోతోంది. స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి టీవీలు, ఇంట్లో వాడే గృహోపకరణాలు అన్ని అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి. ఇటీవల కాలంలో స్మార్ట్ టీవీలకు డిమాండ్ ఏర్పడుతోంది. ఒకప్పటి పోర్టబుల్ టీవీలకు కాలం చెల్లించి. ఇప్పుడు ఆండ్రాయిడ్ కాలం వచ్చేసింది. ప్రజలు టీవీలను కంప్యూటర్ లేదా, స్మార్ట్ ఫోన్లులాగే వినియోగించాలనుకొంటున్నారు. అలాగే ఇంట్లో థియేటర్ అనుభవాన్ని ఆస్వాదించాలనుకొంటున్నారు. ఈ క్రమంలోనే పలు టాప్ బ్రాండ్లు మంచి ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో కూడిన స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తున్నాయి. మంచి హెచ్ డీ క్వాలిటీ పిక్చర్ తో పాటు హై రేంజ్ సౌండ్ సిస్టమ్, పలు ఆండ్రాయిడ్ యాప్ లతో నిక్షిప్తమైన టీవీలను అందిస్తున్నాయి. అయితే వీటిల్లో ధర అనే ప్రధాన అంశంగా ఉంటోంది. ఫీచర్లు ఎన్ని ఉన్నా అవి సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటేనే సేల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో అన్ని టాప్ బ్రాండ్లు బడ్జెట్ లెవెల్లోనే టీవీలను లాంచ్ చేస్తున్నాయి. అలాగే కొన్ని టీవీలు వాటిలోని ఫీచర్లను బట్టి అధిక రేట్లే ఉంటున్నాయి. అయితే ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అన్ని టాప్ బ్రాండ్ల స్మార్ట్ టీవీలపై సూపర్ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు 45శాతం వరకూ ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఒకవేళ మీరు మంచి స్మార్ట్ టీవీ కొనేప్లాన్ లో ఉంటే ఈ ఆఫర్లను అస్సలు మిస్ అవ్వొద్దు. ఆ ఆఫర్ల గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఎల్‌జీ పోస్ 4కే ఓఎల్ఈడీ ఈవో టీవీ.. ఈ టీవీపై ఫ్లిప్ కార్ట్ 45శాతం ప్రారంభ డిస్కౌంట్ ను అందిస్తోంది. ప్రస్తుతం ఈ టీవీ రూ. 1,09,990గా ఉంది. గతంలో రూ, 1,99,990గా ఉండేది. దీనిలో 9 జెన్ 5ఏఐ ప్రాసెసర్ 4కే టెక్నాలజీని వనియోగించారు. దీనిపై ఫ్లిప్ కార్ట్ అదనంగా మరో ప్రత్యేకమైన ఆఫర్ను అందిస్తోంది. అదేంటంటే పాత టీవీ ఎక్స్ చేంజ్ పై రూ. 11వేల వరకూ తగ్గింపు లభిస్తోంది.
సోనీ 55 అంగుళాల అల్ట్రా హెచ్డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ గూగుల్ టీవీ.. ఈ టీవీపై ఫ్లిప్ కార్ట్ పై ఏకంగా 43శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 99,900కాగా ఇప్పుడు ఇది రూ. 55,990కే లభిస్తోంది. అంతేకాక పాత టీవీ ఎక్స్ చేంజ్ పై రూ. 11,000 అదనపు తగ్గింపు ఉంటుంది. దీనిలో ఎక్స్ 1 ప్రాసెసర్ ఉంటుంది. ఇది వేస్ట్ నాయిస్ ని తగ్గించడంతో పాటు విజువల్ ను క్వాలిటీగా అందిస్తుంది.
ఎల్ జీ యూక్యూ7500 55 అంగుళాల అల్ట్రా హెచ్డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ వెబ్ ఓఎస్ టీవీ.. ఫ్లిప్ కార్ట్ ఈ టీవీ పై 41శాతం వరకూ డిస్కౌంట్ ను అందిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 71,990 కాగా, ఆఫర్ పై ఇది రూ. 41,990కి లభిస్తోంది. ఎక్స్ చేంజ్ పై మరో రూ. 7,000 తగ్గింపును పొందొచ్చు. యూహెచ్ డీ 4కే రిజల్యూషన్ తో ఉంటుంది. ట్రూ లైఫ్ విజువల్ క్వాలిటీ, వివిడ్ కలర్స్ ఉంటాయి.
శామ్సంగ్ క్రిస్టల్ 4కే ఐస్మార్ట్ సిరీస్ 43 అంగుళాల అల్ట్రా హెచ్ డీ ఎల్ఈడీ స్మార్ట్ టైజెన్ టీవీ.. ఫ్లిప్ కార్ట్ లో ఈ టీవీపై రూ. 41శాతం తగ్గింపు ఉంది. దీని వాస్తవ ధర రూ. 52,900 కాగా, డిస్కౌంట్ పై రూ. 30,990కే లభిస్తోంది. అంతే కాక పాత టీవీల ఎక్స్ చేంజ్ పై రూ. 11000 అదనపు తగ్గింపు ఉంటుంది. దీనిలో పీయూఆర్ కలర్ తో బెస్ట్ ఇమేజ్ క్వాలిటీని అందిస్తుంది. వివిధ రకాల కలర్స్ అందుబాటులో ఉంటాయి.
ఎల్ జీ యూఆర్7500 50 అంగుళాల అల్ట్రా హెచ్ డీ(4కే) ఎల్ఈడీ స్మార్ట్ వెబ్ ఓఎస్ టీవీ.. ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ టీవీపై 41శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీని అసలు ధర రూ. 69,990 కాగా, ఆఫర్లో రూ. 40,990కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాక పాత టీవీ ఎక్స్ చేంజ్ పై రూ. 11,000 వరకూ తగ్గింపు లభిస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..