Tech Tips: మీ ఫోన్ నుంచి గూగుల్ అకౌంట్‌ను డిలీట్ చేయడం ఎలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..

| Edited By: Ravi Kiran

Jun 22, 2023 | 5:30 AM

మీరు ఒకవేళ ఫోన్ మార్చాలనుకొంటున్నారు అనుకోండి.. లేదా ఏదో ఒక అత్యవసర పని నిమిత్తం ఏదైనా ఫోన్ లో గూగుల్ అకౌంట్ యాడ్ చేసారనుకోండి.. పని అయిపోయాక దానిని రిమూవ్ చేయడం ముఖ్యం. లేకుంటే మీ డేటా మొత్తం ఇతరులు యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది.

Tech Tips: మీ ఫోన్ నుంచి గూగుల్ అకౌంట్‌ను డిలీట్ చేయడం ఎలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..
Google
Follow us on

మీరు కొత్త ఫోన్ కొన్నారా? స్విచ్ ఆన్ చేయగానే మొదట చేసే పని ఏంటి? గూగుల్ అకౌంట్ యాడ్ చేయడం. అవును మరి మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్లలోని అన్ని యాప్స్ అలాగే గూగుల్ సర్వీసెస్ యాక్సెస్ చేయాలంటే అకౌంట్ యాడ్ చేయడం తప్పనసరి. జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోలు, కీప్ నోట్స్, మ్యాప్స్ వంటి అనేక ఫీచర్లు వినియోగించాలంటే అకౌంట్ యాడ్ చేయాల్సిందే. ఇలా చేయడం ద్వారానే డేటా సింక్రనైజ్ చేయడానికి వీలవుతుంది. ఒక్కసారి గూగుల్ అకౌంట్ సిక్రనైజ్ అయితే ప్రపంచంలో ఏ మూలన ఉన్నా మీరు గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యి మీ డేటాను యాక్సిస్ చేయొచ్చు. ఫోన్ లోని కాంటాక్ట్స్, నోట్స్, క్యాలెండర్ ఎంట్రీలు వంటివి ఈ ఫోన్ నుంచైనా చూసే వెసులుబాటు ఉంటుంది. అయితే మీరు ఒకవేళ ఫోన్ మార్చాలనుకొంటున్నారు అనుకోండి.. లేదా ఏదో ఒక అత్యవసర పని నిమిత్తం ఏదైనా ఫోన్ లో గూగుల్ అకౌంట్ యాడ్ చేసారనుకోండి. పని అయిపోయాక దానిని రిమూవ్ చేయడం ముఖ్యం. లేకుంటే మీ డేటా మొత్తం ఇతరులు యాక్సెస్ చేసే ప్రమాదం ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఒక్కసారి యాడ్ చేసిన గూగుల్ అకౌంట్ ను స్మార్ట్ ఫోన్ నుంచి రిమూవ్ చేయడం ఎలా? ఇదిగో ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..

ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఇలా..

  • ఆండ్రాయిడ్ ఫోన్లోని సెట్టింగ్స్ లోకి వెళ్లాలి. దానిలో కిందకి వెళ్లి పాస్ వర్డ్స్ అండ్ అకౌంట్స్ అని ఓ ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత మీరు తొలగించాలనుకుంటున్న అకౌంట్ ను ఎంపిక చేసుకొని రీమూవ్ అకౌంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీకు వచ్చిన పాప్ మెసేజ్ ను చూసి నిర్ణయాన్ని కన్ ఫర్మ్ చేయాలి. అప్పుడు ఫోన్ కి మీరు పెట్టుకున్న పిన్ నంబర్ ను అడుగుతుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే చాలు అకౌంట్ రిమూవ్ అవుతుంది.

ఐఫోన్ నుంచి ఇలా తొలగించాలి.

ఐఫోన్ లోని సెట్టింగ్స్ ఓపెన్ణ చేయాలి. కిందకి వెళ్లి మెయిల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. అనంతరం అకౌంట్స్ ని ఎంపిక చేసుకోవాలి. దానిలో జీమెయిల్ అకౌంట్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత డిలీట్ అకౌంట్ పై క్లిక్ చేస్తే డిలీట్ ఫ్రమ్ మై ఐఫోన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిని క్లిక్ చేయాలి. అంతే మీ ఐ ఫోన్ నుంచి అకౌంట్ రిమూవ్ అవుతుంది.

రిమోట్ యాక్సెస్ ద్వారా..

మీ ఫోన్ పోయిందనుకోండి. ఆ ఫోన్ సింక్రనైజ్ అయి ఉంటుంది కాబట్టి దాని నుంచి గూగుల్ అకౌంట్ తొలగించాలంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..

ఇవి కూడా చదవండి
  • వెబ్ బ్రౌజర్ లోకి వెళ్లి గూగుల్ అకౌంట్ లోకి సైన్ ఇన్ అవ్వాలి.
  • దానిలో సైడ్ బార్ లో ఉండే సెక్యూరిటీ ని ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత ఓపెన్ అయిన మెనూ నుంచి యువర్ డివైజెస్, ఆ తర్వాత మేనేజ్ ఆల్ డివైజెస్ ను ఎంపిక చేసుకోవాలి.
  • అప్పుడు మీ అకౌంట్ లింక్ అయ్యి ఉన్న డివైజ్ లు అన్నింటిని గూగుల్ మీకు చూపిస్తుంది. దానిలో మీరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్ ని ఎంపిక చేసుకొని మిగిలిన వాటి నుంచి సైన్ అవుట్ చేయాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..